విధాత:టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికి మూడో పతకాన్ని అందించిన యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కు నా తరఫున,జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. అంతర్జాతీయ క్రీడా వేదికలపై తొలి అడుగులు వేస్తున్న దశలోనే లవ్లీనా కాంస్య పతకం దక్కించుకోవడం యువ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. క్రీడల్లో గెలుపోటములు సహజం. అయితే ఎంత చిత్తశుద్ధితో పోరాడాం అనేది ముఖ్యం. లవ్లీనా పోరాడిన తీరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.