Site icon vidhaatha

ఛత్తీష్‌గడ్ లో లొంగిపోయిన మావోయిస్టులు

విధాత‌: ఛత్తీష్‌గడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు.జిల్లా ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ్ ఎదుట సరెండర్ అయ్యారు.ఇంటింటికి తిరిగి చేసిన ప్రచారానికి ఆకర్షితులై ఇప్పటివరకు 454మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిశారని జిల్లా ఎస్పీ తెలిపారు.లొంగిపోయిన వారిలో 117మంది రివార్డ్ కలిగిన మావోలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.లొంగిపోయినవారు ఎల్‌ఓఎస్‌, మిలిషియా సభ్యులుగా పనిచేసినట్లు తెలిపారు.వీరికి పునరావాసం క్రింద తక్షణం పదివేల రూపాయల చెక్‌ను అందజేశారు.

Exit mobile version