విధాత,విజయవాడ: భారతీయ జనతా పార్టీ విజయవాడ పార్లమెంటు మైనారిటీ మోర్చా నూతన కార్యవర్గాన్ని మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ మౌలాలి ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని (నందిగామ), మన్సూర్ అలి (విజయవాడ వెస్ట్), ప్రధాన కార్యదర్శులుగా షేక్ నాగుల్ మీరా (జగ్గయ్యపేట), ఎం.డి. షబ్బీర్ (విస్సన్నపేట), షేక్ మహబూబ్ సుభాని (మైలవరం), కార్యదర్శులుగా షేక్ షమీమ్ (మైలవరం), అబ్దుల్ సల్మాన్ (విజయవాడ వెస్ట్), కోశాధికారిగా ఎం.డి. వశీం అక్రమ్, కార్యవర్గ సభ్యులుగా విజయవాడ వెస్ట్ కు చెందిన ఎండి రఫీ, షేక్ మహబూబ్ జానీ, షేక్ మొయినుద్దీన్ పాషా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు షేక్ మౌలాలి శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భాజపా బలోపేతానికి మోర్ఛాలు మూలస్తంభాలుగా నిలుస్తాయని తెలిపారు.
దేశంలో మోదీ ప్రభుత్వం ముస్లిమ్స్ కోసం తీసుకొచ్చిన సంస్కరణలు ముస్లిం, మైనార్టీ ప్రజలకు ఎంతో మేలు చేకూరిందని చెప్పారు. భాజపా ప్రవేశపెట్టిన సిఏఏ, ఎన్.ఆర్.సి వల్ల నిజమైన భారతదేశ ముస్లింగా సుస్థిర స్థానం మనం కలిగి ఉంటామని తెలిపారు. నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మోర్చా, పార్టీ బలోపేతం కోసం పని చెయ్యాలని సూచించారు.త్వరలోనే కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి దశ దిశ నిర్దేశాలు పార్టీ పెద్దల్ని ఆహ్వానించి ఏర్పాటు చేస్తామని మౌలాలి తెలిపారు.