Site icon vidhaatha

Nandamuri Balakrishna : నా విజయాలు నా తల్లిదండ్రులకు అంకితం : బాలకృష్ణ

Nandamuri Balakrishna

అమరావతి : నా వరుస సినీ విజయాలను.. ప్రజల విజయాలుగా భావిస్తున్నానని..ఈ విజయాలను నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని ప్రముఖ హీరో, పద్మ భూషణ్(Padmna Bushan), హిందుపురం ఎమ్మెల్యే(Hindupuram MLA) నందమూరి బాలకృష్ణ తెలిపారు. గురువారం తన స్వగ్రామం నిమ్మకూరులో(Nimmakuru) పర్యటించిన బాలకృష్ణకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు గార్డ్ ఆఫ్ హానర్ తో స్వాగతం పలికారు. మహిళలు జై బాలయ్య అంటూ మంగళహారతులు పట్టారు. బాలయ్య గ్రామంలోని ఎన్టీఆర్(NTR), బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తిచేసుకుని పద్మభూషణ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం నేను అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నా సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకోవాలని నిమ్మకూరుకు వచ్చానన్నారు. పదవులు నాకు ముఖ్యం కాదు… వాటికే నేను అలంకారమన్నది నా భావన అన్నారు. తండ్రైన, గురువైన, దేవుడైన నాకు అన్నీ ఎన్టీఆరే. పాత్రలకు ప్రాణం పోస్తూ నటించిన ఎన్టీఆర్ దరిదాపులకు చేరాలన్నదే నా తపన. ఎన్టీఆర్ ఉన్నత స్థితికి రావడానికి… నా తల్లి బసవతారకం చేసిన త్యాగాలు, అందించిన సహకారం మరువలేనిది. తల్లి పేరిట ఏర్పాటైన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో అంతర్జాతీయ వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు.

తెలుగు వారంతా ఎక్కడ ఉన్నా ఒక్కటే అన్నది తన తండ్రి ఎన్టీఆర్ భావన అని.. తన ఆలోచన కూడా అదేనని నొక్కిచెప్పారు. మీడియా వల్ల ప్రపంచం కుదించుకుపోయిందని.. సోషల్ మీడియాను మంచికి వాడండి… వినాశనానికి వద్దు అని హితవు పలికారు. మంచి ఉద్దేశంతో అఖండ- 2(Akhanda 2) చిత్రం తీశాం. కులాలకు ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా తెరకెక్కించాం’ అని నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పేర్కొన్నారు. వరదలతో తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నష్టపోయారని, అన్నదాతలు ఇబ్బందు పడుతున్నారని.. తెలుగు వారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా పరస్పరం సహకరించుకుంటూ అండగా ఉండాలన్నారు. తన జయాపజయాల్లో ప్రాంతాలకు అతీతంగా తోడుగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. సందేశం ఉండాలన్న లక్ష్యంతో నేను ప్రతి సినిమా చేస్తున్నానన్నారు.

దృఢ సంకల్పం ఉంటే భగీరథులు కావచ్చని… రాయలసీమకు నీటిని ఇచ్చి సీఎం చంద్రబాబు నిరూపించారని బాలయ్య కొనియాడారు. హిందూపురంలో(Hindupuram) తాగునీటి సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉందన్నారు ఎన్టీఆర్(NTR), నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నేడు భౌగోళికంగా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా, రాయలసీమను నా అడ్డాగా భావిస్తా’ అని బాలకృష్ణ(Balakrishna) తెలిపారు.

Exit mobile version