Site icon vidhaatha

కేసీఆర్‌కు ఇక్క‌డెవ‌రూ భ‌య‌ప‌డ‌రు- టీజీ వెంక‌టేష్‌

విధాత:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత టీజీ వెంకటేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీటి వివాదంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది నీటి సమస్య అని, చిన్న పొరపాటు జరిగినా తరతరాలు నాయకులను ప్రజలు క్షమించరని అన్నారు. ఈ విషయంలో ఏపీ నాయకులు ఎక్కడా పొరపాటు పడకుండా అందరూ ఒకే మాటపై ఉంటే పరిష్కారం లభిస్తుందని, ఏపీకి మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక్కడ సీఎం కేసీఆర్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవలన్నారు. ‘మీరు బెదిరిస్తే మా నాయకులు భయపడరని.. ఎందు కంటే టీడీపీ, వైసీపీ, ఇతర పార్టీలకు చెందిన ఏపీ నాయకులకు తెలంగాణలో ఓట్లు ఉన్నాయని, మీ తెలంగాణ నాయకులుండే ఓట్లు మా ప్రాంతంలో లేవు.. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని’ అన్నారు.

Exit mobile version