Activa | పెండింగ్ చ‌లాన్లు రూ. 28 వేలు.. యాక్టివాకు నిప్పు పెట్టిన ఘ‌నుడు

Activa | హెల్మెట్ ధ‌రించ‌కుండా బైక్ రైడ్ చేయ‌డం, సీటు బెల్ట్ ధ‌రించ‌కుండా కారు డ్రైవింగ్ చేయ‌డం, రాంగ్ రూట్‌లో వెళ్ల‌డం, నో పార్కింగ్ జోన్‌లో పార్కింగ్ చేయ‌డం, ట్రిపుల్ రైడింగ్ చేయ‌డం వంటివ‌న్నీ ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు కింద‌కు వ‌స్తాయి. ఇలా ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారికి ట్రాఫిక్ పోలీసులు చ‌లాన్లు జారీ చేయ‌డం స‌హ‌జం. అయితే ఓ రైడ‌ర్ త‌న యాక్టివా(నంబ‌ర్ ఏపీ 28 డీడ‌బ్ల్యూ 4497)పై ఉన్న చ‌లాన్లు చూసి బిత్త‌ర‌పోయాడు. భారీ మొత్తంలో […]

  • Publish Date - June 21, 2023 / 09:50 AM IST

Activa |

హెల్మెట్ ధ‌రించ‌కుండా బైక్ రైడ్ చేయ‌డం, సీటు బెల్ట్ ధ‌రించ‌కుండా కారు డ్రైవింగ్ చేయ‌డం, రాంగ్ రూట్‌లో వెళ్ల‌డం, నో పార్కింగ్ జోన్‌లో పార్కింగ్ చేయ‌డం, ట్రిపుల్ రైడింగ్ చేయ‌డం వంటివ‌న్నీ ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు కింద‌కు వ‌స్తాయి.

ఇలా ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారికి ట్రాఫిక్ పోలీసులు చ‌లాన్లు జారీ చేయ‌డం స‌హ‌జం. అయితే ఓ రైడ‌ర్ త‌న యాక్టివా(నంబ‌ర్ ఏపీ 28 డీడ‌బ్ల్యూ 4497)పై ఉన్న చ‌లాన్లు చూసి బిత్త‌ర‌పోయాడు. భారీ మొత్తంలో చలాన్లు ఉండ‌టంతో, ఆ న‌గ‌దు చెల్లించ‌లేక చివ‌ర‌కు పోలీసులు చూస్తుండ‌గానే యాక్టివాకు నిప్పు పెట్టాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. శంషాబాద్ – బెంగళూరు జాతీయ ర‌హ‌దారిపై ట్రాఫిక్ పోలీసులు వాహ‌నాల‌ను త‌నిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌, ఉల్లంఘిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని చ‌లాన్లు విధిస్తున్నారు.

అయితే ఫ‌సీయుద్దీన్ అనే యువ‌కుడు త‌న యాక్టివాపై వెళ్తుండ‌గా, అత‌న్ని కూడా పోలీసులు ఆపారు. ఆ యాక్టివాపై రూ. 28 వేల చ‌లాన్లు ఉన్నాయ‌ని, చెల్లించాల‌ని పోలీసులు డిమాండ్ చేశారు. దీంతో ఫ‌సీయుద్దీన్ పోలీసుల‌ను దుర్భాష‌లాడి, వారి ముందే యాక్టివాకు నిప్పు పెట్టాడు. వెంటనే పోలీసులు అప్పమత్తమై మంట‌ల‌ను ఆర్పేశారు.

Latest News