Site icon vidhaatha

ఉత్తమ సంతానానికి రామకృష్ణ మఠం ఆర్యజనని

విధాత‌: ఆర్యజనని .. గర్భిణీల కోసం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం. చక్కని ఆరోగ్యంతో పాటు మానసిక ఎదుగుదల కోసం.. సర్వోన్నత భారతాన్ని నిర్మించే రేపటి పౌరుల కోసం రూపొందించినది. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఆన్ లైన్ క్లాసులు జరగనున్నాయి. ‘మేధ’ పేరుతో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించనుంది. ప్రతి నెలా మూడు వర్క్‌షాపులు నిర్వహిస్తారు. ప్రతి నెలా మొదటి శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.

రిజిస్ట్రేషన్ కోసం WWW.ARYAJANANI.ORGను క్లిక్ చేయగలరు. పరిమిత సభ్యులకు మాత్రమే అవకాశం.

శిశువు గర్భస్థ దశలో ఉన్నప్పుడు లభించిన ప్రేరణ, సంస్కారమే.. ఆ శిశువు మంచి వ్యక్తిగా ఎదగడానికి గానీ చెడు వ్యక్తిగా ఎదగటానికి గానీ కారణభూతమవుతుందని ఈ సంస్థ చెబుతోంది. సంస్కారవంతులైన, దైవం పట్ల భక్తి, శ్రద్ధలు కలిగిన తల్లులకు ఉన్నతమైన వ్యక్తులు జన్మిస్తారని స్వామి వివేకానంద చెప్పిన మాటల స్ఫూర్తితో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఆర్యజనని అంటే ఆదర్శ జనని అని అర్థం. శిశువు జననానికి సంబంధించిన ఆధునిక విజ్ఞానం ఈ కార్యక్రమం ద్వారా అందించనున్నారు. ఈ వర్క్ షాప్‌లో ధ్యానం, భజనలు, యోగాసనాలు ఇతర విషయాలు నేర్పిస్తారు. అలాగే గర్భిణులకు ఉపయోగపడే దినచర్యను ఉపదేశిస్తారు. ఉత్తమ బిడ్డకు జన్మనివ్వడానికి అవకాశం కల్పిస్తారు.

Exit mobile version