Site icon vidhaatha

Rambha | ఆ హీరో ఓకే అంటే.. మొగుడ్ని కూడా లెక్క చేయదట!

Rambha |

విధాత‌: సినిమా రంగంలో ఎవరు ఎప్పుడు ముందు వరుసలో ఉండి విజయాన్ని అందుకుంటారో చెప్పడం కష్టం. వరుసగా సినిమాలు చేస్తూ, మంచి సక్సెస్ అందుకున్న తర్వాత తెరమరుగు అయితే.. వాళ్ళను ప్రేక్షకులు గుర్తు పెట్టుకునేది దాదాపు తక్కువే. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని స్టార్స్ అంతా రీల్స్‌తో యాక్టివేట్‌గా ఉండటంతో మరిచిపోయే ఛాన్స్ లేకుండా పోయింది.

అయితే అప్పుడప్పుడు కొన్ని స్టేట్మెంట్స్‌తో మరీ ముఖ్యంగా అవకాశం వచ్చినప్పుడల్లా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తమ ఇష్టాలను పంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటున్నారు తారలు. విషయంలోకి వస్తే.. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ ఇలా అప్పటి హీరోలతోనూ.. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ వంటి తర్వాతి తరం హీరోలతోనూ క్రేజీ స్టెప్పులు వేసి మెప్పించిన ముద్దుగుమ్మ రంభ.

‘బావగారూ బాగున్నారా’, ‘హిట్లర్’ చిత్రాలలో చిరంజీవితో సమంగా స్టెప్పులు వేసిన ఈ అమ్మడు, కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని వెళిపోయింది. పెళ్ళి తర్వాత నటన వైపు మళ్ళీ రాకపోయినా, రంభ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తే. అందం, చక్కని అభినయం రంభ సొంతం. చాలా సందర్భాల్లో రంభ తనకు నచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెబుతూనే ఉంది.

‘యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్‌తో ఓపాటలో అతనితో సమంగా స్టెప్పులేసి కుర్రకారును ఓ ఊపు ఊపేసింది కూడా. తాజాగా తనకు మళ్లీ ఛాన్స్ వేస్తే ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందని.. ప్రభాస్ అంటే అంత ఇష్టమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రంభ చెప్పుకొచ్చింది.

ప్రభాస్‌తో అవకాశం వస్తే మాత్రం తన భర్తతో పోట్లాడైనా ఒప్పించి.. అతని సరసన నటిస్తానని రంభ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఆమె చెప్పిన ఈ మాటలు వింటుంటే.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేందుకు రంభ సిద్ధంగా ఉందని.. అందుకే ఇలాంటి హింట్స్ ఇస్తుందనేలా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఒకవేళ నిజంగానే రంభ కనుక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే మాత్రం.. ఆమె క్రేజ్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే మొదలవుతుందని.. అప్పటికీ ఇప్పటికీ తనలో మార్పు పెద్దగా రాలేదంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్.. రంభ స్టామినాని తెలియజేస్తున్నాయి.

Exit mobile version