Site icon vidhaatha

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్‌ విభజన 2031 తర్వాతే… కేంద్రం

విధాత:2026లో జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ విషయం వెల్లడించారు. నియోజకవర్గాల డీలిమిటేషన్‌ 2031 తరవాతే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 170 అధికరణం ప్రకారమే నిజయోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేసారు.

Exit mobile version