Site icon vidhaatha

తెలంగాణ- ఆంధ్రా అంతరాష్ట్ర సరిహద్దులో ఆంక్షలు కఠినతరం.

విధాత:ఆంధ్రా-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లను ఈరోజు జిల్లా ఎస్పీ R. భాస్కరన్ IPS తనిఖీ చేసినారు. ఈ సందర్బంగా యస్.పి మాట్లాడుతూ ఆంధ్రా నుండి తెలంగాణ లో వచ్చే వారికి e-పాస్ అనుమతి తప్పనిసరి, ఇది లాక్డౌన్ మినహాయింపు సమయం ఉ.6 గంటల నుండి ఉ.10 గంటల సమయంలో కూడా e-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తాం అన్నారు.

అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ లకు అనుమతులు యధావిధిగా కొనసాగుతాయని అన్నారు. అలాగే మేల్లచెరువు, చితలపాలెం, మఠంపల్లి, పాలకవీడు మండలాల్లో ఉన్న ఆంధ్ర-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దుల్లో అత్యవసర సేవలు మినహాయించి ఇతర అన్ని సాధారణ రాకపోకలను 24 గంటలు నిషేదించాం అన్నారు.

కొంత మంది వాహనదారులు, ప్రజలు లాక్డౌన్ మినహాయింపు సమయాన్ని ఆసరాగా చేసుకుని అనవసరంగా సరిహద్దులు దాటుతున్నారు, అలాగే ఆంధ్రా నుండి ఎలాంటి అనుమతి లేకుండా ఉదయం 4 నుండి 6 గంటలోపు రామాపురం x రోడ్డు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ కు చేరుకుని అక్కడే 6 గంటల వరకు వేచి ఉండి మినహాయింపు సమయంలో తెలంగాణలోకి వస్తున్నారు ఈ కారణం చేత వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఆంక్షలను కఠినతరం చేసినామని యస్.పి తెలిపినారు. తెలంగాణా లోకి రావాలంటే ఎసమయంలోనైనా e-పాస్ ఉండాలని తెలిపినారు. ఇది ప్రజలు గమనించి పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసినారు.R. భాస్కరన్ IPS సూర్యాపేట జిల్లా.

Exit mobile version