Site icon vidhaatha

అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి తెలుగు మహిళ ..!! శిరీష బండ్ల ….

విధాత:అమెరికా కుబేరుల మ‌ధ్య స్పేస్ వార్ తీవ్ర‌మ‌వుతోంది. అంత‌రిక్షంలోకి వెళ్ల‌డానికి అమెజాన్ ఫౌండ‌ర్ జెఫ్ బెజోస్ ప్లాన్ చేయ‌గా.. ఆయ‌న కంటే ముందే అక్క‌డికి వెళ్ల‌డానికి వ‌ర్జిన్ గెలాక్టిక్ ఫౌండ‌ర్ రిచ‌ర్డ్ బ్రాన్స‌న్ సిద్ధ‌మ‌య్యారు. అయితే ఇక్క‌డ మ‌రో విశేషం ఏమిటంటే.. బ్రాన్స‌న్‌తో క‌లిసి ఓ తెలుగ‌మ్మాయి కూడా స్పేస్‌లోకి వెళ్ల‌బోతోంది.

ఆమె పేరు బండ్ల శిరీష్‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరుకు చెందిన ఆమె.. కొన్నాళ్లుగా వ‌ర్జిన్ గెలాక్టిక్‌లో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాలు, రీసెర్చ్ ఆప‌రేష‌న్‌ల వైస్ ప్రెసిడెంట్‌గా ప‌ని చేస్తున్నారు. ఇప్పుడామె విజ‌యవంతంగా అంత‌రిక్షంలోకి వెళ్తే.. క‌ల్పనా చావ్లా త‌ర్వాత ఇండియాలో పుట్టి స్పేస్‌లో అడుగుపెట్టిన రెండో మ‌హిళ‌గా నిలుస్తారు.

శిరీష 2015లో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల మేనేజ‌ర్‌గా వ‌ర్జిన్ గెలాక్టిక్‌లో చేరారు. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడీ స్థాయికి వ‌చ్చారు. ఈ మ‌ధ్యే 747 ప్లేన్ ఉప‌యోగించి అంత‌రిక్షంలోకి శాటిలైట్‌ను లాంచ్ చేసిన వర్జిన్ ఆర్బిట్ వాషింగ్ట‌న్ ఆప‌రేష‌న్స్‌ను కూడా చూసుకుంటోంది. ప‌ర్‌డ్యూ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్, జార్జ్‌టౌన్ యూనివ‌ర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. తానాలోనూ శిరీష యాక్టివ్‌గా వ్య‌వ‌హ‌రించారు.

రెండో మ‌హిళ‌.. నాలుగో ఇండియ‌న్‌

ఇప్పుడు శిరీష ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకోబోతోంది. స్పేస్‌లో అడుగుపెట్ట‌బోతున్న రెండో భార‌తీయ‌ మ‌హిళ కాగా.. ఓవ‌రాల్‌గా నాలుగో ఇండియ‌న్‌. మ‌న దేశం త‌ర‌ఫున రాకేశ్ శ‌ర్మ అంత‌రిక్షంలోకి వెళ్లిన తొలి వ్య‌క్తి కాగా.. క‌ల్పనా చావ్లాతోపాటు మ‌రో ఇండియ‌న్‌-అమెరిక‌న్ ఆస్ట్రోనాట్ సునీతా విలియ‌మ్స్ కూడా ఈ ఘ‌న‌త సాధించారు.

Exit mobile version