విద్యార్ధుల ఏడుపులతో దద్దరిల్లి పోయిన పాఠశాల.. అక్కడకు వెళ్ళినవారు జరుగుతున్నది చూసి నిర్ఘాంత పోయారు

విధాత:చెన్నైలోని తిరువళ్ళూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉదయం 11 గంటలు ,ఉన్నట్లుండి విద్యార్ధుల ఏడుపులతో దద్దరిల్లి పో యింది..ఏమి జరుగుతుందో తెలియక బయట వున్నవారు పరుగున పాఠశాలలోనికి పరిగెత్తారు..అక్కడకు వెళ్ళినవారు అక్కడ జరుగుతున్నది చూసి నిర్ఘాంత పోయారు.. విద్యార్ధు లు ఒక 30 యేండ్ల యువకుని చుట్టిముట్టి ఏదో ప్రాదేయప డుతూ ,వేడుకుంటున్నారు..కొందరు కాళ్ళు పట్టుకొని కదల నీయడంలేదు..ఆశ్చర్యమేమిటంటే ఆ యువకుడూ వారితో పాటు ఏడుస్తూవున్నాడు…ఇంతకీ అక్కడ ఏమి జరుగు తుం ది??. జె.భగవాన్ ఆ పాఠశాలలో […]

  • Publish Date - September 4, 2021 / 10:21 AM IST

విధాత:చెన్నైలోని తిరువళ్ళూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉదయం 11 గంటలు ,ఉన్నట్లుండి విద్యార్ధుల ఏడుపులతో దద్దరిల్లి పో యింది..ఏమి జరుగుతుందో తెలియక బయట వున్నవారు పరుగున పాఠశాలలోనికి పరిగెత్తారు..అక్కడకు వెళ్ళినవారు అక్కడ జరుగుతున్నది చూసి నిర్ఘాంత పోయారు.. విద్యార్ధు లు ఒక 30 యేండ్ల యువకుని చుట్టిముట్టి ఏదో ప్రాదేయప డుతూ ,వేడుకుంటున్నారు..కొందరు కాళ్ళు పట్టుకొని కదల నీయడంలేదు..ఆశ్చర్యమేమిటంటే ఆ యువకుడూ వారితో పాటు ఏడుస్తూవున్నాడు…ఇంతకీ అక్కడ ఏమి జరుగు తుం ది??. జె.భగవాన్ ఆ పాఠశాలలో 2014లో ఇంగ్లీషు టీచర్ గా జాయిన్ అయినాడు.

అక్కడ చదివే పిల్లలంతా చాలా వరకు పేదకుటుంబాల నుండి వచ్చినవారే…భగవాన్ సర్వీస్ జాయి న్ అయినప్పటినుండీ పిల్లలతో స్నేహితుడిగా కలిసి పోయా డు. ఆప్యాయంగా మాట్లాడటం!! ఎంతో నేర్పుగా వారికి బోధ న చేయడం,!కొందరికి భవిష్యత్ చదువుల గురించి వివరించే వాడు,,పిల్లలకు ఎంతో ఇష్టుడైనాడు..అలాంటి భగవాన్ కి ట్రా న్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది…అది తెలిసిన పిల్లలు అతనిని వెళ్ళ నివ్వకుండా అడ్డుపడ్డారు,, ఇది వైరల్ అయి రాష్ట్రమంతా సం చలనంగా మారి రాష్ట్రవిద్యాశాధికారులకు చేరింది.. ప్రస్తుతా నికి 10రోజులు బదిలీ ఆపుతూ ఉత్తర్యులు ఇచ్చారు.

Latest News