తిరుమల: ఇరురాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) ఛైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజా స్పందించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. ‘‘ తెలంగాణ ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను. ఏపీకి అన్యాయం చేయొద్దు. విద్యుదుత్పత్తికి నీటిని అక్రమంగా వినియోగించడం సరికాదు. ఏపీకి అన్యాయం చేస్తే సహించేది లేదు’’ అని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. జల వివాదం పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.