Site icon vidhaatha

Mrunal Thakur | ‘అమ్మ సీతా మహాలక్ష్మి ఫొటోలు డిలీట్‌ చేయమ్మా..’ సీతా రామం ఫేమ్‌ మృణాల్‌ ఠాగూర్‌పై ట్రోల్స్‌

Mrunal Thakur |

ఒక్క సినిమాతోనే ఫుల్‌ క్రేజ్‌ను సంపాదించింది మృణాల్‌ ఠాగూర్‌. టాలీవుడ్‌లో ‘సీతా రామం’తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నది. తెలుగు మంచి హిట్‌తో కెరీర్‌ను ప్రారంభించిన ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీబిజీగా ఉన్నది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ట్రోల్‌ సాధారణమైన విషయమే. అయితే, సినీతారలను ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటారు.

మృణాల్‌ ఠాగూర్‌ ఇటీవల ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలు కొద్దిసేపట్లోనే వైరల్‌ అయ్యాయి. ఈ ఫొటోలపై పలువురు నెటిజన్లు కామెంట్లతో ట్రోల్స్‌ చేస్తున్నారు. ఫొటోలు కాస్త బోల్డ్‌గా ఉండడంతో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

‘అమ్మా సీతామహాలక్ష్మి ఈ ఫొటోలను డిలీట్‌ చెయ్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ బ్యూటీ ఎక్కడికి వెళ్లిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. గతంలోను పలుసార్లు ట్రోల్‌ రాగా.. స్పందించింది. నా జీవితం నా ఇష్టమని, నాకు నచ్చినట్లు నేనుంటా అంటూ స్పష్టం చేసింది.

అయినా ట్రోల్స్‌ మాత్రం ఆగడం లేదు. మృణాల్‌ మొదట బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత మరాఠీ చిత్రం ‘విట్టి దండు’ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మరాఠీ, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది.

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ‘సీతా రామం’ చిత్రంలో మృణాల్‌ నటించగా.. ‘సీతా మహాలక్ష్మి’గా తనదైన నటనతో ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకున్నది. ఈ చిత్రంతో మృణాల్‌కు అవకాశాలు క్యూకట్టాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు మకాం మార్చింది. ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.

Exit mobile version