విధాత : కుక్కలు, పిల్లులు, కోతుల మాదిరిగా..వన్యప్రాణులను మచ్చిక చేసుకోవడం అంతా సులభం కాదు. వాటికి ఎప్పుడు తిక్కరేగి ఏం చేస్తాయో తెలుసుకునేలోపే మనుషులు వాటి దాడులకు గురవుతుండటం తరుచూ చూస్తుంటాం. అయితే బౌద్ద సాధువులు పులులు, సింహాలతో మనుగడ సాగించడం బౌద్ద దేశాల్లో దర్శనమిస్తుంటాయి. అలాగే భారత్ లోనూ సాధు సంతులు వణ్యప్రాణులతో సహవాసం చేస్తుండటం అక్కడక్కడా కనిపిస్తుంది. తాజాగా ఓ సాధువు తన ప్రమాదకరమైన బల్లూకాల(ఎలుగుబంట్లు)ను సాధారణ పెంపుడు కుక్కల మాదిరిగా సాకుతున్న వీడియో వైరల్ గా మారింది.
రెండు భీకర బల్లూకాలు ఆ సాధువు చేతిలోని ఆహార పదార్ధాలను తినేందుకు పెంపుకు కుక్కల మాదిరిగా వచ్చిన తీరు అందరిని విస్మయ పరుస్తుంది. ఇది చూసిన నెటిజన్లు నిరాడంబరతో నిరంతర ధ్యానం..ఆకులు, కందమూలాలతో హిమాలయాలు..అడవుల్లో నివసించే సాధువులు ప్రకృతిలో భాగమై కనిపిస్తుంటారని..అందుకే వారికి ఇలాంటి అసాధ్యాలు సుసాధ్యమవుతాయని కామెంట్లు పెడుతున్నారు.