Site icon vidhaatha

తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం

విధాత:శ్రీశైలం ప్రాజెక్ట్‌లో తెలంగాణ విద్యుత్ ఉత్పాదనపై కేఆర్‌ఎంబీకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు.కేఆర్‌ఎంబీ మెంబర్‌ సెక్రటరీకి ఏపీ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్‌ లేఖ పంపింది.శ్రీశైలం ప్రాజెక్ట్‌లో అవసరం లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయటం వల్ల నీటిమట్టం తగ్గుతోందని ఏపీ ఆందోళన వ్యక్తం.నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరివ్వలేమని ఈఎన్‌సీ పేర్కొంది.

విద్యుత్ ఉత్పాదన ద్వారా వస్తున్న నీరు సాగర్‌లో నిలిపే అవకాశం లేదని, సాగర్‌లో పూర్తి స్థాయి నీటిమట్టం ఉంది.శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పాదనకు వాడుతున్న నీరంతా సముద్రంలో వృధాగా కలిసిపోతోందని, తెలంగాణ విద్యుత్ ఉత్పాదన వల్ల వృధా అవుతున్న నీటిని వారికి కేటాయించిన కోటా నుంచి మినహాయించాలన్న ఏపీ సర్కారు.విద్యుత్ ఉత్పాదన తక్షణమే ఆపాలని కేఆర్‌ఎంబీని ఏపీ ప్రభుత్వం కోరింది.

Exit mobile version