Site icon vidhaatha

జెంకిస్తున్న జికా వైర‌స్

విధాత‌: ఓ వైపు దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే..మరోవైపు కేరళలో జికా వైరస్ కేసులు బయటపడట ఆందోళన కలిగిస్తోంది.తిరువనంతపురం జిల్లాలో 13 జికావైరస్ కేసులు నమోదయ్యాయి.
పూణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్ కు19 మంది శాంపిళ్లను పంపించగా..వారిలో 12 మందికి జికా వైరస్ సోకినట్లుతేలింది. అంతకుముందు ఓ 24 ఏళ్లగర్భవతికి పాజిటివ్ వచ్చింది. ఆమె ఈనెల 7న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువులో ఎటువంటి వైరస్ లక్షణాలు లేవని చెప్పారు. తల్లీబిడ్డల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.జికా వైరస్ సోకితే ఫీవర్, దద్దుర్లు, కండ్లకలకలు, కీళ్ల నొప్పులు, తల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెప్తున్నారు.

Exit mobile version