OTT Movies: ఈ వారం థియేట‌ర్, ఓటీటీలో ఎన్ని సినిమాలు విడుద‌ల కానున్నాయి.. ఏ మూవీపై ఎక్కువ అంచ‌నాలు ఉన్నాయి..!

OTT Movies: ప్ర‌తి వారం ప్రేక్ష‌కుల ముందుకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. చాలా రోజులుగా పెద్ద సినిమాలు విడుద‌ల కాక‌పోవ‌డంతో చిన్న సినిమాలు సంద‌డి చేస్తున్నాయి. ఇటీవ‌ల వ‌చ్చి ‘సామజవరగమన’, ‘బేబీ’ సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. గతవారం సినిమాలు, సిరీస్‌లు కలిపి మొత్తంగా 19 ప్రాజెక్టులు ప్రేక్షకులని ప‌ల‌క‌రించాయి. ఇక ఈ వారం కూడా అదే రేంజ్‌లోనే విడుద‌ల అవుతుండ‌గా, ఇందులో కొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. థియేటర్ రిలీజ్ […]

  • Publish Date - July 21, 2023 / 01:30 AM IST

OTT Movies: ప్ర‌తి వారం ప్రేక్ష‌కుల ముందుకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. చాలా రోజులుగా పెద్ద సినిమాలు విడుద‌ల కాక‌పోవ‌డంతో చిన్న సినిమాలు సంద‌డి చేస్తున్నాయి. ఇటీవ‌ల వ‌చ్చి ‘సామజవరగమన’, ‘బేబీ’ సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. గతవారం సినిమాలు, సిరీస్‌లు కలిపి మొత్తంగా 19 ప్రాజెక్టులు ప్రేక్షకులని ప‌ల‌క‌రించాయి.

ఇక ఈ వారం కూడా అదే రేంజ్‌లోనే విడుద‌ల అవుతుండ‌గా, ఇందులో కొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. థియేటర్ రిలీజ్ మూవీస్ చూస్తే ముందుగా అశ్విన్ బాబు, నందితా శ్వేత కథానాయికగా నటించిన హిడింబ‌బ చిత్రం ఉంది. జులై 20న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి.

ఇక చైతన్య రావు, లావణ్య జంటగా న‌టించిన అన్నపూర్ణ ఫొటో స్టూడియో చిత్రం జులై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని నటించిన చిత్రం ‘హత్య’ జూలై 21న రిలీజ్ కానుంది. త‌మిళంలో ఇంత‌క‌ముందే విడుద‌ల కాగా, ఇప్పుడు డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. రుహానీ శర్మ, వికాస్ వశిష్ట్ లీడ్ రోల్స్ పోషించిన హ‌ర్ చిత్రం జులై 21న విడుదలకు సిద్ధమైంది. శ్రీ కమల్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన జిలేబి కూడా జులై 21న విడుదల కానుంది.

వీటితో పాటు హాస్టల్ హుడుగారు బెకగిద్దరె (కన్నడ) : జులై 21, ఓపెన్‌హీమర్ (ఇంగ్లీష్) : జులై 21, బార్బీ (ఇంగ్లీష్) : జులై 21, ఒప్పెన్‌ హైమర్‌ – జులై 21న, అలా ఇలా ఎలా – జులై 21న, కాజల్‌ కార్తీక – జులై 21న‌, నాగద్వీపం- జులై 22న విడుదల కానున్నాయి.

ఓటీటీ రిలీజెస్ చూస్తే.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో బవాల్ (హిందీ) : జులై 21న స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో అన్నోన్: కేవ్ ఆఫ్ బోన్స్ (హాలీవుడ్) – జూలై 17, ది డీపెస్ట్‌ బ్రెత్‌ (హాలీవుడ్)- జులై 19, స్వీట్‌ మంగోలియాస్‌ (వెబ్‌సిరీస్‌3)- జులై 20, దే క్లోన్‌డ్‌ టైరోన్‌ (హాలీవుడ్‌)- జులై 21న స్ట్రీమింగ్ కానున్నాయి. జీ5లో ఎస్టేట్ (తమిళ్) – జూలై 16, స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ – జూలై 18న స్ట్రీమింగ్ అవుతున్నాయి.ఇక జియోలో ట్రయల్ పీరియడ్ (హిందీ) – జూలై 21, స్పెషల్ ఒప్స్: లయనెస్ – జూలై 23న స్రీమింగ్ కానుంది. మొత్తానికి ఈ వారం కూడా ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జా దొర‌క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Latest News