Site icon vidhaatha

బద్వేల్‌ ఉప ఎన్నికకు తెదేపా అభ్యర్థి ఇతనే

విధాత,అమరావతి: కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికకు తెదేపా అభ్యర్థిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. బద్వేల్‌ ఉప ఎన్నికలో ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఓబుళాపురం రాజశేఖర్‌ 2019లో పోటీ చేసి ఓడి పోయారు. బద్వేల్‌ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. వైకాపా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో బద్వేలు శాసనసభ స్థానం ఖాళీ అయింది.

Exit mobile version