Site icon vidhaatha

కేసీఆర్ తో ఒకసారి చెడితే మళ్లీ అతకదు..ఈటెల రాజేందర్

కేసీఆర్ తో ఒకసారి చెడితే మళ్లీ అతకదు.. ఇన్నారెడ్డి తో మొదలు పెడితే నాయిని నర్సింహా రెడ్డి వరకు అదే జరిగింది. నాకు ..కేసీఆర్ తో మళ్ళీ అతుకుతుందని నేను అనుకోవటం లేదు.

2018 ఎన్నికల అప్పటినుంచే నన్ను వెంటాడుతున్న రు.. నాకు తెలియకుండా నా ఇంటి పైన ఎన్నికల టైం లో రైడ్ చేయించారు. నా ప్రత్యర్థికి ఆర్థిక సాయం చేశారు.

లంచ్ టైం ఒకసారి ఒక ఆర్డీవో వచ్చి నాతో కలిసి లంచ్ చేస్తే అదేదో జరిగినట్లు క్రియేట్ చేశారు.

కొత్త పార్టీ పెట్టాలని ఇప్పటివరకు ఎప్పుడు అనుకోలేదు..

కొద్దీ రోజులుగా కేటీఆర్ కొంతమంది టీఆరెస్ నేతల నుండి నాకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు.

మూడు రోజులుగా ఏదో జరుగుతుందని నాకు తెలిసింది.. ఏమన్నా ఉంటే నన్ను నేరుగా అడగొచ్చు కదా అని అడుగుదాం అనుకున్న..కెటిఆర్ అందుబాటులోకి రాలేదు.అవతలివాళ్లు ముందస్తు స్క్రిప్ట్ రెడీ చేసి అమలు చేశారు.జరిగిన పరిణాలపై నాకు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేదు.ప్లాన్ ప్రకారమే చేయాలని అనుకున్నారు. అదే చేస్తున్నారు.

వీడు మాట వినడం లేదన్న అక్కసు తోనే సీఎం ఈ విదంగా నాపై కుట్రలు చేశారు.కేసీఆర్ సంగతి నాకు బాగా తెలుసు.. అంత ఈజీగా నన్ను వదలడు.. అన్ని కోణాల్లో వెంటాడుతాడు.సివిల్ సప్లైస్ లోనో లేకపోతే .. దేవర యంజాల్ లో నాకున్న 6 ఏకరాల భూమి దేవాలయ భూమి కోటలో సమైఖ్యాంధ్ర లో చేర్చారు..అది ఇప్పటివరకు క్లియర్ కాలేదు.. ఈ కేసులు పెడతరేమో?

విచారణలో తేలితే దమ్ముంటే నన్ను అరెస్టు చేయాలి.

-కేసీఆర్ నిర్ణయాలను వ్యతిరేకించిన చాలామంది ఆలే నరేంద్ర ,ఇన్నయ్య , నాయిని నర్సింహారెడ్డి , విజయశాంతి , ఇప్పుడు నేను ఇలా ఇబ్బంది పడాల్సిందే.తెలంగాణలో ఆంధ్రా లో దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం లేదు అవసరమైతే అన్ని రకాలుగా దాడులు చేస్తున్నారు.

Exit mobile version