Site icon vidhaatha

సుప్రీం తీర్పుతోనైనా జగన్‌ మారాలి: గోరంట్ల

విధాత,అమరావతి: అమరావతి భూముల కొనుగోళ్ల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీం ఇచ్చిన తీర్పుతోనైనా సీఎం జగన్‌ మారాలని అని తెదేపా సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్‌ తక్షణమే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో తప్పిదాలు చేసి తాత్కాలిక ఆనందం పొందుతున్నారన్నారని ఆక్షేపించారు. ‘‘పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది?జగన్‌ తప్పిదాల కారణంగా ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయి’’ అని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

Exit mobile version