Site icon vidhaatha

సుప్రీంకోర్టు కు కూడా ఫేక్ అఫిడవిట్ సమర్పించిన ఫేక్ సీఎం.. నారా లోకేష్

ఆఖరికి దేశ అత్యున్నత న్యాయస్థానానికి కూడా ఫేక్ అఫిడవిట్ సమర్పించి మరోసారి ఫేక్ సీఎం అనే పేరుని సార్ధకం చేసుకున్నారు జగన్ రెడ్డి.
విధాత:పరీక్షల నిర్వహణకు సరైన ప్రణాళిక లేని అఫిడవిట్ సమర్పించి చివాట్లు తిన్నారు.మీరు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం పరీక్షల నిర్వహణకు 35 వేల క్లాస్ రూమ్స్ ఉండాలి.అన్ని రూమ్స్,సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేసిందా?ప్రాణాల రక్షణకు,పరీక్షల నిర్వహణకు కనీస ఏర్పాట్లు కూడా చెయ్యకుండానే మొండి పట్టుదలతో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని సుప్రీం కోర్టు ప్రశ్నించడం జగన్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట.
పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే పోయే ఒక్కో ప్రాణానికి కోటి రూపాయిలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి అని కోర్టు వ్యాఖ్యానించడం చూస్తే ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదనే విషయం బయటపడింది.ఇప్పటికైనా చేసిన తప్పుని సరిదిద్దుకొని విద్యార్థులు,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాణాలు బలితీసుకునే పరీక్షల నిర్వహణ ఆలోచనకి స్వస్తి పలకాలి.తక్షణమే
పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని సుప్రీం కోర్టుకి తెలపాలి.

…నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

ReadMore:ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి

Exit mobile version