Site icon vidhaatha

ఎప్పుడూ చిల్లర పనులు చేయలేదు: ఈటల

హైదరాబాద్: తనపై వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏమాత్రం తప్పున్నా తనను శిక్షించాలన్నారు. ఉద్దేశ పూర్వకంగానే తనపై తప్పుడు రాతలు రాస్తున్నారని తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు విచారణ జరిగిందని ఈటల పేర్కొన్నారు.

అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులేనన్నారు. జమున హ్యాచరీస్‌లో తాను డైరెక్టర్‌ను కానన్నారు. ప్రభుత్వంలో ఒక కమిట్‌మెంట్‌తో పనిచేశానన్నారు. ఎప్పుడూ చిల్లర పనులు చేయలేదని ఈటల పేర్కొన్నారు. సాగర్‌లో కేవలం కేసీఆర్ ప్రచారం వల్లే గెలవలేదన్నారు.

కార్యకర్తలందరి సమిష్టి కృషి వల్లే పార్టీ గెలిచిందన్నారు. గులాబీ కండువా వేసుకున్న ప్రతి కార్యకర్తకు.. పార్టీకి ఓనర్ అనే ఫీలింగే ఉంటుందని ఈటల పేర్కొన్నారు.

Exit mobile version