పదవి కోసం ఇంతగా దిగజారిపోవాలా సవాంగ్ ?.. నారా లోకేష్

విధాత:స్వప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను తాడేపల్లి ప్యాలెస్ కు తాకట్టు పెట్టడం మీ కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోతుంది.దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకున్న జగన్ రెడ్డిని వదిలేసి ప్రతిపక్షాలపై ఏడుస్తారెందుకు? నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడిఓ సరళ పై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేసిన ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే మౌనం దాల్చారెందుకు? సీఎం ఇంటి పక్కనే జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను పట్టుకున్నారా అని […]

  • Publish Date - September 4, 2021 / 10:08 AM IST

విధాత:స్వప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను తాడేపల్లి ప్యాలెస్ కు తాకట్టు పెట్టడం మీ కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోతుంది.దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకున్న జగన్ రెడ్డిని వదిలేసి ప్రతిపక్షాలపై ఏడుస్తారెందుకు? నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడిఓ సరళ పై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేసిన ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే మౌనం దాల్చారెందుకు? సీఎం ఇంటి పక్కనే జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను పట్టుకున్నారా అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు.

మంత్రులు,ఎమ్మెల్యేల కామక్రీడలకు బలైపోయిన మహిళల ఫిర్యాదుపై స్పందించమంటే…నీళ్లు నములుతారేంటి . మీరు షాడో హోంమంత్రి సజ్జల దగ్గర పనిచేస్తున్న గుమస్తా కాదు, రాష్ట్ర డీజీపీ అని గుర్తుపెట్టుకోండి.దిశ చట్టం చట్టబద్ధం కాలేదని ముందు మీరు సీఎంకి,మంత్రులకు అవగాహన కల్పించండి. వారంతా నిందితులకు ఉరిశిక్ష వేసేసాం అని పగటి కలలు కంటున్నారు.

…నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Latest News