Site icon vidhaatha

ఒలింపిక్‌ నినాదంలో సవరణలు

విధాత,టోక్యో : అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) ఒలింపిక్‌ నినాదంలో సవరణలు చేసింది. అంతకుముందు ‘వేగంగా, ఉన్నతంగా, బలంగా’ ఉన్న నినాదానికి కొత్తగా ‘కలిసికట్టుగా’ అనే పదాన్ని జోడించారు. ఈ మేరకు ఐవోసీ దీనిని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఒలింపిక్‌ చార్టర్‌లో సవరణలు చేసింది. ఐవోసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ ఈ పదాన్ని సూచించారు. కరోనా నేపథ్యంలో ‘కలిసికట్టుగా’ అనే పదాన్ని సూచించినట్టు ఆయన తెలిపారు. దీనిపై థామస్‌ స్పందిస్తూ.. ‘ఈరోజు పరిస్థితి చూస్తే మీకు ఇదంతా చాలా సులభంగా జరిగిందని మీకు అనిపించవచ్చు. కానీ అది సత్యానికి దూరం. దీని వెనుక 15 నెలల పాటు మేము నిద్రలేని రాత్రులు గడిపాం’ అని అన్నారు.

Exit mobile version