Site icon vidhaatha

క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన బాక్సర్‌ సతీష్‌ కుమార్‌

క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన బాక్సర్‌ సతీష్‌ కుమార్‌
టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ 91 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ సతీష్‌ కుమార్‌ శుభారంభం చేశాడు. జమైకాకు చెందిన బాక్సర్‌ బ్రౌన్‌ రికార్డోపై 4-1తో విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఆడిన మూడు బౌట్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సతీష్‌ రికార్డోపై తనదైన పంచ్‌లతో అలరించాడు. ఇక ఆగస్టు 1న జరిగే క్వార్టర్‌ఫైనల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జలోలోవ్‌తో తలపడనున్నాడు.

ప్రీ క్వార్టర్స్‌లో పీవీ సింధు విజయం
పతకమే లక్ష్యంగా బరిలోకి పీవీ సింధు మరో ఘనవిజయాన్ని నమోదు చేసింది. ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిక్‌ఫెల్డ్‌ను సింధు .. 21-15, 21-13తో వరుస గేముల్లో చిత్తు చేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో సింధు అకానే యమగుచితో తలపడే అవకాశం ఉంది.

అర్జెంటీనాపై భారత జట్టు ఘన విజయం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు గ్రూఫ్‌ మ్యాచ్‌లో మరో విజయాన్ని నమోదు చేసింది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-1 తేడాతో ఘన విజయాన్ని అందుకొని క్వార్టర్స్‌కు చేరుకొంది. భారత్‌ జట్టు తరపున వి కుమార్‌, వీఎస్‌ ప్రసాద్‌, హర్మన్‌ప్రీత్‌సింగ్‌లు ఆట 43,58,59 వ నిమిషంలో గోల్స్‌ చేయగా.. అర్జెంటీనా తరపున కాసెల్లా స్కుత్‌ ఆట 9 వ నిమిషంలో గోల్‌ చేశాడు. ఇక భారత జట్టు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. ఇప్పటికే మూడు విజయాలు సాధించిన భారత్‌ క్వార్టర్స్‌కు దాదాపు చేరినట్లే.

ఆర్చరీ: ప్రీక్వార్టర్స్‌కు అతాను దాస్‌ అర్హత
ట్యోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో అతాను దాస్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. రౌండ్‌ ఆఫ్‌ 16లో కొరియాకు చెందిన ఓహ్‌ జిన్హీక్‌పై 6-5 తేడాతో విజయాన్ని అందుకున్నాడు. జూలై 31న జరగనున్న రౌండ్‌ ఆఫ్‌ 8లో అతాను దాస్‌ జపాన్‌కు చెందిన ఫురుకావా తకహారుతో పోటీ పడనున్నాడు.

Exit mobile version