Ms Dhoni| టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ(Ms Dhoni) వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌లో ఆడతాడా లేదా అనే సందేహం అభిమానులలో ఎప్పటి నుండో ఉంది. అయతే దీనిపై ధోని ఏమైన క్లారిటీ ఇస్తాడా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.2025 ఐపీఎల్ (IPL 2025)వేలం సమీపిస్తుండగా, రిటెన్షన్ గడువు దాదాపు ముగియనుంది.గత మూడు సీజన్లుగా ధోనీ తన చివరి ఐపీఎల్ ఆడుతున్నాడన్న వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. మరి ఈ సారి ధోని గ్రౌండ్‌లో అడుగుపెడతాడా లేదా అనేది సస్పెన్స్. అయితే సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ ధోనీ తమ జట్టుకు ఆడాలని తాము కోరుకుంటున్నామని, కానీ అతను ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదన్నారు.
ప్రస్తుతం ధోని ఐపీఎల్‌కు కావాల్సిన ఫిట్‌నెస్ సాధించే పనిలో పడ్డట్టు టాక్. రాంచీ క్రికెట్ స్టేడియంలో ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టాడని, అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ధోనిని సీఎస్కే రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. సీఎస్‌కే రిటెన్షన్‌కు ధోనీ అంగీకరించాడని అతన్ని సన్నిహితుడు ఒకరు తెలిపారు. ఐపీఎల్ పాలక మండలి, ఐదేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా ఉన్న భారత క్రికెటర్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా గుర్తించాలని నిర్ణయించటంతో, ఈ కొత్త నిబంధన ధోనీకి ప్రయోజనకరంగా మారింది.2018 మెగా వేలం తర్వాత ఈ రూల్‌ను తొలగించారు. ధోనీ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పట్టుబట్టడంతో బీసీసీఐ మళ్లీ ఆ రూల్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ రూల్ వలన సీఎస్కే అతడిని కేవలం రూ.4 కోట్లకే రిటైన్ చేసుకునే అవకాశాన్ని పొందింది.
43 ఏళ్ల ధోని ఇటీవల తరచు గాయాల బారిన పడుతున్నాడు.ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వెంటనే ధోనీ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం కోలుకున్నట్టుగా తెలుస్తుంది.ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. వయసు, గాయాల చరిత్ర దృష్ట్యా అతను కొన్ని మ్యాచ్‌ల వరకు బ్యాటింగ్ మాత్రమే చేయనున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ.. యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాడు. ప్రస్తుతం ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. అయితే ధోని తాజా సీజన్‌లో ఆడతాడా లేదా అనేది ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. అక్టోబర్ 31వ తేదీ లోపు చెప్తానని ధోనీ అన్నాడు.