Tilak Varma Vists Legala Sports Academy | హైదరాబాద్‌లో తిలక్ వర్మ సందడి

హైదరాబాద్‌లో తిలక్ వర్మ సందడి, ఆసియా కప్‌లో కీలక ఇన్నింగ్స్‌తో భారత్ గెలుపు అందించిన తిలక్‌ను అభిమానులు ఘనంగా సత్కరించారు.

Tilak-Varma

విధాత, హైదరాబాద్: టీమిండియా తెలుగు తేజం తిలక్ వర్మ హైదరాబాద్ లో మంగళవారం సందడి చేశారు. అసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ తో పాకిస్తాన్ పై భారత్ కు చిరస్మరణీయ విజయం అందించిన తిలక్ వర్మ తాను శిక్షణ పొందిన లింగంపల్లిలో లెగాల క్రికెట్ అకాడమీకి వచ్చారు. తిలక్ వర్మను చూసేందుకు క్రికెట్ అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆయనతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. తిలక్‌ను, అతని కోచ్‌ సలామ్‌ బయాష్‌లను అకాడమీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. తిలక్‌ ఇంటి నుంచి ఈ లెగాలా అకాడమీకి రోజూ 40 కిలోమీటర్ల ప్రయాణంచి మరి కోచింగ్ తీసుకోవడం విశేషం.

ఈ సందర్భంగా తిలక్‌ మాట్లాడుతూ.. ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా గెలవడం చాలా సంతృప్తినిచ్చిందన్నారు దాయాది పాకిస్తాన్ తో మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించడమే టార్గెట్‌గా పెట్టుకొని ఆడానన్నారు. ఆ సమయంలో నా కళ్ల ముందు దేశమే కనిపించింది. నేను ఆడిన ఇన్నింగ్స్‌లలో ఇదే అత్యుత్తమమైందని స్పష్టం చేశారు. ఫైనల్లో పాక్‌ ఆటగాళ్ల స్టెడ్జింగ్‌ మాపై ఏమాత్రం ప్రభావం చూపలేదన్నారు. స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లి నాకు ఎంతో స్పూర్తినిచ్చాడని..విరాట్‌ కోహ్లితో నన్ను పోల్చడం గర్వంగా ఉందని అన్నాడు.

 

Exit mobile version