Ind vs Nz| న్యూజిలాండ్ చేతిలో వరుసగా బెంగళూరు, పుణె టెస్టులో ఓడిపోయిన భారత్ జట్టు.. వాంఖడే టెస్టులో అయిన కనీసం గెలిచి పరువు నిలుపుకోవాలని భావించింది. శనివారం న్యూజిలాండ్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 171/9తో నిలవగా.. ఈ రోజు మరో మూడు పరుగులు చేసి ఆలౌట్ అయింది.తద్వారా భారత్‌కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ జట్టులో విల్ యంగ్ అత్యధికంగా 51 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా 5, అశ్విన్ 3 వికెట్లు.. ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ఇక 147 పరుగులని భారత అవలీలగా చేజ్ చేస్తుందని అనుకున్నారు.
కాని పరిస్థతి దారుణంగా ఉంది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 29 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. అనూహ్య స్పిన్, అస్థిర బౌన్స్ వికెట్లకు కారణం అనుకుంటే పొరపాటే. తప్పుడు షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. రోహిత్ చెత్త షాట్‌తో వికెట్ చేజార్చుకున్నాడు. శుభ్‌మన్ గిల్ బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎడమచేతి వాటం స్పిన్ తన బలహీనత అని విరాట్ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఫుల్ టాస్ బంతికి వెనుదిరిగాడు. బ్యాటర్లు సాధారణ ప్రదర్శనతోనే టీమిండియా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. యశస్వీ జైస్వాల్ వికెట్ కాస్త చెప్పుకోదగ్గది. ఫిలిప్స్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు.
జడేజా కూడా లెగ్ వైపు ఆడబోగా, బంతి ప్యాడ్స్ కి తగిలి యంగ్ చేతిలో పడింది. అయితే కష్టాలలో ఉన్న టీమిండియాని పంత్ ఆదుకున్నాడు.సింగిల్ మ్యాన్ షోతో టీమిండియాని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. లంచ్ సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేయగా క్రీజులో పంత్(50 బంతుల్లో 53: 7 ఫోర్లు, 1సిక్స్), సుందర్(6) ఉన్నారు. న్యూజిలాండ్ గెలుపు కోసం ఇంకా నాలు వికెట్స్ కావల్సి ఉండగా, భారత్ విజయానికి 55 పరుగులు కావాలి. పంత్ వికెట్ పడితే ఇండియా గెలుపు అవకాశాలు పూర్తిగా పోయినట్టే. ఏం చేస్తారో చూడాలి.
అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235, భారత్ 263 పరుగులు చేశాయి. కాగా ముంబై పిచ్ పై నాలుగో ఇన్నింగ్స్ లో పరుగులు చేయడం కష్టమని క్రికెట్ నిపుణలు భావిస్తున్నారు. కాబట్టి తక్కువ టార్గెట్ ఉన్నా భారత బ్యాటర్లు నిలకడగా ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టులో డారిల్ మిచెల్ 82 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీ సాయంతో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా తరఫున రవీంద్ర జడేజా 5 వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శుభ్‌మన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. ఈ హాఫ్ సెంచరీల సాయంతో భారత