Site icon vidhaatha

Rohit Sharma| రోహిత్ బ‌ల‌హీన‌త‌ని ప‌సిగ‌ట్టేసిన బౌల‌ర్స్.. ప్ర‌తిసారి వారికే దొరికిపోతున్నాడుగా..!

Rohit Sharma| టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫామ్ విష‌యంలో అభిమానులు తీవ్ర నిరాశ‌కి గుర‌వుతున్నారు. రోహిత్ నాయ‌క‌త్వంలో టీమిండియా ప్ర‌స్తుతం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు లీగ్ స్టేజ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా రెండింట గెలిచింది. మూడో మ్యాచ్ వ‌ర్షం వ‌ల‌న రద్ధైంది. ఇక సూప‌ర్ 8లో భాగంగా గ‌త రాత్రి ఆఫ్ఘ‌నిస్తాన్‌తో భార‌త్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌గా, 47 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. అయితే భార‌త్ గెలుపోట‌ముల విష‌యం ప‌క్కన పెడితే రోహిత్ ఫామ్ తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచెస్​లో సరిగ్గా రాణించని హిట్​మ్యాన్.. సూపర్-8లోనూ దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు.

సూపర్ పోరులో ఆఫ్ఘ‌నిస్తాన్‌తో ఆడిన అతడు 13 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్ బాట ప‌ట్టాడు. క్రీజులో కుదురుకున్నాడు అనుకునేలోపు ఔట్ అవుతున్నాడు. ఆఫ్ఘ‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ‌.. ఫారుకీ వేసిన స్లోవర్ బాల్​కు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతికి గాల్లోకి లేవ‌గా, దానిని ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఎలాంటి తడబాటు లేకుడా అందుకున్నాడు. స్లోవర్ డెలివరీని సరిగ్గా జడ్జ్ చేయలేక రోహిత్ ఇలా ఔట్ కావ‌డంతో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అందుకు కార‌ణం ఈ మ‌ధ్య రోహిత్ ఎక్కువగా లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్​లో ఔట్ అవుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం.

కొద్ది రోజుల క్రితం ఐపీఎల్-2024లో ఆరుసార్లు లెఫ్టార్ట్ బౌల‌ర్స్‌కి దొరికిన రోహిత్ శ‌ర్మ ఇప్పుడు జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ లో కూడా వాళ్ల బౌలింగ్‌లో ఔట్ అవుతున్నాడు. పాకిస్థాన్​తో జ‌రిగిన మ్యాచ్​లో ఎడమ చేతి వాటం బౌలర్ షాహీన్ అఫ్రిదీకి చిక్కాడు. ఇక ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లోనూ లెఫ్టార్మ్ సీమర్​ బౌలింగ్​లోనే వెనుదిరిగాడు. ఎడమ చేతి వాటం పేసర్లను ఎదుర్కోవడంలో తనకు ఉన్న బలహీనతను హిట్ మ్యాన్ అధిగ‌మించ‌లేక‌పోతున్నాడు. ఇప్పుడు ఇది భార‌త జ‌ట్టుకి శాపంగా మారింది. ఈ వీక్​నెస్​ను రోహిత్ అధిగ‌మించ‌కపోతే నాకౌట్ మ్యాచెస్​లో టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోకత‌ప్ప‌లేదు. మ‌రోవైపు ఓపెనింగ్‌లో వ‌స్తున్న విరాట్ కోహ్లీ కూడా పెద్ద‌గా రాణించ‌లేక‌పోవ‌డం భార‌త్‌కి ఇబ్బందిగా మారింది.

Exit mobile version