IND vs ENG Test Series | విధాత : టీమిండియా కీలక ఆటగాడు..వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) పై తన గాయంపై వస్తున్న కథనాలు చెక్ పెడుతూ..నాల్గవ టెస్టు రెండో రోజు బ్యాటింగ్ కు దిగి అందరిని షాక్ గురి చేశాడు. పాదంకు తగిలిన తీవ్ర గాయాన్ని సైతం లెక్క చేయకుండా కష్టాల్లో ఉన్న టీమిండియాకు విలువైన పరుగులు జోడించేందుకు పంత్ తన బాధను భరిస్తునే బ్యాటింగ్ కు దిగాడు. 314 పరుగుల వద్ధ 6 వికెట్లు కోల్పోయిన పరిస్థితులలో బ్యాటింగ్ కు దిగిన పంత్(39) నాటౌట్ తో లంచ్ సమయానికి క్రీజ్ లో ఉన్నాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్(20) పరుగులతో ఆడుతున్నాడు. వారిద్దరు ప్రస్తుతం ఏడో వికెట్ కు ఏడు పరుగులు జోడించారు. లంచ్ తర్వాత ఇండియా తొలి ఇన్నింగ్స్ కొనసాగనుంది.
ఇంగ్లాండ్ తో సిరీస్ కు దూరమని కథనాలు
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో తలపడుతున్న భారత క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలిందని… టీమిండియా కీలక ఆటగాడు..వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) గాయం కారణంగా ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు(England Test Series) దూరం కావచ్చని మీడియా కథనాలు వెలువడ్డాయి. మాంచెస్టర్(Manchester) వేదికగా జరుగుతున్న నాల్గవ టెస్టులో తొలి రోజు బ్యాటింగ్ చేస్తూ గాయపడిన రిషబ్ పంత్ కు ఆరు వారాల విశ్రాంతి అవసరమైన వైద్యులు సూచించారని ఆ కథనాలు పేర్కొన్నాయి. స్వీప్ షాట్ కు ప్రయత్నిస్తున్న క్రమంలో పంత్ పాదం ఫ్రాక్చర్ అయినట్లుగా తెలిందని.. దాని నుంచి కోలుకోవడానికి ఆరు వారాల సయమం పట్టవచ్చని వైద్యులు చెప్పారని కథనం.
దీంతో పంత్ నాలుగో టెస్టుతో పాటు ఐదో టెస్టు సహా సెప్టెంబర్ వరకు క్రికెట్ కు దూరం కానున్నాడని వార్తలు వెలువడ్డాయి. పంత్ గాయం నేపథ్యంలో ఇక నాల్గవ టెస్టులో టీమిండియా 10మంది ఆటగాళ్లతోనే ఆడనుందని.. అయితే రిజర్వ్ వికెట్ కీపర్ ద్రువ్ జురెల్ కీపింగ్ మాత్రం చేయనున్నారని మీడియా కథనాలు వచ్చాయి. అయితే రిషబ్ పంత్ మాత్రం తన గాయంపై వెలువడిన కథనాలకు విరుద్దంగా టెస్టు రెండో రోజు బ్యాటింగ్ కు దిగడం అందరిని అశ్చర్య పరిచింది.