David Warner| ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner)కి తెలుగు రాష్ట్రాలలోను ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌తో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన వార్నర్.. తెలుగు సినిమా పాటలకి రీల్స్ చేస్తూ ఎంతగానో అలరించాడు. అయితే వార్నర్ 2018లో కేప్‌టౌన్ టెస్టులో సాండ్ పేపర్ సంఘటనతో ఏడాది పాటు ఆటకు, జీవితకాలం కెప్టెన్సీకి నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.అయితే డేవిడ్ వార్నర్‌పై జీవిత కాల కెప్టెన్సీ నిషేధం ఎత్తివేసింది క్రికెట్ ఆస్ట్రేలియా(Australia). దీంతో వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో నాయకత్వం చేపట్టే అవకాశం ఉంటుంది. క్రికెట్ ఆస్ట్రేలియా కండక్ట్ కమిషన్ సమీక్షతో ఆరున్నరేళ్ల కాలం తర్వాత సారథి బాధ్యతల నిషేధం నుంచి వార్నర్ విముక్తి పొందాడు
సాండ్ పాపర్ సంఘటన పట్ల డేవిడ్ వార్నర్ పశ్చాత్తాపం పడుతున్నట్లు ప్యానెల్ భావించి ఈ నిర్ణయం తీసుకుందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలియజేసింది. అంతేగాక కెప్టెన్సీపై నిషేధం ఎత్తివేస్తే, యువ క్రికెట్ల అభివృద్ధికి వార్నర్ (Warner)చేయగలిగే సహకారాన్ని గుర్తిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా తెలియజేశారు. ఈ నిషేదం వలన డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాలో కెప్టెన్సీ చేసే అవకాశాన్ని ఆరున్నర ఏళ్లు కోల్పోవడం జరిగింది.అయితే ఐపీఎల్‌లో మాత్రం హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథి బాధ్యతలు నిర్వర్తించాడు.ఐపీఎల్ లో వార్నర్‌కి మంచి రికార్డ్ ఉంది.
ఇక 37 ఏళ్ల డేవిడ్ వార్నర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2023 వన్డే ప్రపంచకప్ అనంతరం వన్డేలకు, 2024 టీ20 ప్రపంచకప్‌తో పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్మర్ తన అవసరం జట్టుకి ఉందని భావిస్తే భారత్‌తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తిరిగి బరిలోకి దిగుతానని ఇటీవల ప్రకటించారు. వార్నర్ రాకతో జట్టు మరింత పటిష్టంగా మారుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) భావిస్తే అతడిని తిరిగి జట్టులోకి తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.