Viral news : వర్షాకాలంలో భూమిలోపలి వేడిని భరించలేక పాములు పుట్టల్లోంచి బయటికి వస్తాయి. ఆవాసం కోసం వెతుకుతూ ఒక్కోసారి సమీపంలోని ఇళ్లలో దూరుతాయి. బైకులు, కార్లలో కూడా పాములు చేరతాయి. వంటింట్లో, కోళ్ల గూళ్లలో, బాత్రూమ్‌లలో నక్కి ఉంటుంటాయి. వాహనాల డిక్కీల్లో, ఇరుకు సందుల్లో దూరుతాయి.
అలాంటి సందర్భాల్లో తీసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అశోక్‌కుమార్ అనే వ్యక్తి ashokshera94 అనే తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఏముందంటే.. టాయిలెట్‌లో దూరిన పాము పాయకాన కుండీలో చుట్టుకుని పడుకుంది.
టాయిలెట్ లోపలికి వెళ్లేందుకు ఓ వ్యక్తి డోర్ తీయగానే అది బుసకొడుతూ పడగెత్తి పైకి లేచింది. పాము పడగెత్తి చూస్తున్న దృశ్యాలను ఆ వ్యక్తి తన మొబైల్‌లో బంధించాడు. ఆ వీడియోను అశోక్‌కుమార్ అనే జర్నలిస్టు తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్‌లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.