Site icon vidhaatha

Currency notes garland | కరెన్సీ నోట్ల మాల, చిల్లర సంచులతో వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్‌..!

Currency notes garland : దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ నియోజవర్గాల్లో ఉప ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఎన్నికలకు శనివారం నుంచే నామినేషన్‌ల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులోని విక్రంవాడి నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతున్నది.

విక్రంవాడిలో తొలిరోజు ప్రధాన పార్టీ అభ్యర్థులెవరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. అసలు అధికార డీఎంకే మినహా ఇంకా ఏ ప్రధాన పార్టీ అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు. మొదటి రోజు కేవలం ముగ్గురు ఇండిపెండెంట్‌లు మాత్రమే నామినేషన్‌లు వేశారు. వారిలో ఆలిండియా యాంటీ కరప్షన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు అగ్ని ఆళ్వార్‌ కూడా ఒకరు. ఆయన నోట్ల మాల, చిల్లర సంచులతో రిటర్నింగ్‌ కార్యాలయానికి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

డిపాజిట్‌గా చెల్లించాల్సిన రూ.10 వేలలో కొన్ని రూ.20, రూ.50, రూ.100 నోట్లను మాలగా గుచ్చి ఆయన మెడలో వేసుకున్నారు. మిగతా నగదును ఆయన ఒక్క రూపాయి, రెండు రూపాయల కాయిన్‌ల రూపంలో సంచుల్లో తీసుకొచ్చారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తన సిబ్బందితో వాటిని లెక్కబెట్టించి, అగ్ని అళ్వార్ నామినేషన్‌ను స్వీకరించారు. అళ్వార్‌ తర్వాత పద్మరాజన్, నూర్‌ ముహమ్మద్‌ రాజేంద్రన్‌ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.

Exit mobile version