Best Tourist Places | పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? వీటిపై ఓ లుక్కేయండి..!

  • Publish Date - April 8, 2024 / 10:01 AM IST

Best Tourist Places | భారతదేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. ఆలయాలు, చార్రిక ప్రదేశాలు, ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. వెళ్లాలనే కోరిక, చూడాలనే తపన ఉండాలనే కానీ పర్యాటకులకు భారత్‌కు మించిన స్వర్గధామం మరొకటి లేదు. ముఖ్యంగా దక్షిణ భారతంలోని దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో పాటు బీచ్‌లు, తోటలు, చారిత్రక కట్టాలు అనేకం ఉన్నాయి.

గోకర్ణం

కర్ణాటక గోకర్ణంలోని బీచ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఓం బీచ్, హాఫ్ మూన్ బీచ్‌లు ఎంతో ప్రసిద్ధి. బెంగళూరు నుంచి దాదాపు 483 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉన్నది. ఎత్తయిన తాటిచెట్లు, సముద్ర కెటరాలు ప్రకృతి ప్రియులను మమైరిపిస్తాయి. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలను తనివితీరా చూడాల్సిందే తప్పా. మటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తాయి. మహాబలేశ్వర్ ఆలయం సాధువులు, ఆరాధకులకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో పర్యటించేందుకు మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది.

మున్నార్

కేరళలోని మున్నార్ పట్టణం అనేక తేయాకు తోటలకు ప్రసిద్ధి. ఇక్కడి జలపాతాలు ఏడాది పొడవునా పర్యాటకులను కనువిందు చేస్తాయి. ట్రీహౌస్‌లో నివసించడం, టీ ఎస్టేట్ పర్యటనకు మాధురానుభూతిని ఇస్తుంది. ఇక్కడికి కొచ్చిన్‌, ఎర్నాకులం రైల్వేస్టేషన్ల నుంచి ఇక్కడికి చేర్చుకునేందుకు వీలుంది.

ఊటీ

ఊటీని క్వీన్ ఆఫ్ ది హిల్ స్టేషన్స్‌గా పిలుస్తారు. వేసవి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ ఆస్వాదించొచ్చు. తమిళనాడులోని పశ్చిమ కనుమలలోని నీలగిరి శ్రేణిలో ఉన్న ఒక అద్భుతమైన నగరం. నీలి కొండలు. ప్రకృతి దృశ్యాలు మనోహరమైన జ్ఞాపకాలను అందిస్తుంది. 3 నుంచి 5 రోజులు ట్రిప్‌ని సందర్శించవచ్చు. కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్టుపాళయం, కూనూర్ టాయ్ రైళ్లతో ఊటీకి చేరుకోవచ్చు.

కొడైకెనాల్

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో కొడైకెనాల్ అద్భుతమైన నగరం. ‘ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్‌’గా పిలుస్తారు. ఇక్కడి సిల్వర్ క్యాస్కేడ్ జలపాతం, బెరిజామ్ సరస్సు, పాంబర్ జలపాతం తదితర ప్రాంతాలను వీక్షించేందుకు వీలుంటుంది. 3 నుంచి 7 రోజులు గడపవచ్చు. మధురై విమానాశ్రయం, దిండిగల్ మధురై మధ్య ఉన్న కొడై రైల్వే స్టేషన్ ద్వారా కొడైకెనాల్ చేరుకోవచ్చు.

కూర్గ్

దక్షిణ భారతదేశంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో కూర్గ్‌ ఒకటి. ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. కర్ణాటకలో భాగమైన కూర్గ్ టీ, కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో అబ్బే జలపాతం, మడికేరి కోట, ఇరుప్పు జలపాతాలతో సహా అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ పర్యాటకులకు మధురానుభూతిని ఇస్తాయి.

Latest News