Mysterious UFO | కెనడాలో మిస్టీరియస్‌ వెలుగులు..! గ్రహాంతరవాసుల యూఎఫ్‌ఓలు కావొచ్చన్న జంట..!

Mysterious UFO | విశాల విశ్వంలో మానవులు ఒంటరి కాదని.. ఎక్కడో ఒకచోట జీవం ఉండే ఉంటుందని ఖగోళశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వారి జాడ కోసం అన్వేషిస్తున్నారు. గ్రహాంతరవాసులు ఎక్కడో ఒకచోట ఉన్నా మనకన్నా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వాడుతున్నారని అంచనా వేస్తున్నారు.

  • Publish Date - July 2, 2024 / 10:41 AM IST

Mysterious UFO | విశాల విశ్వంలో మానవులు ఒంటరి కాదని.. ఎక్కడో ఒకచోట జీవం ఉండే ఉంటుందని ఖగోళశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వారి జాడ కోసం అన్వేషిస్తున్నారు. గ్రహాంతరవాసులు ఎక్కడో ఒకచోట ఉన్నా మనకన్నా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వాడుతున్నారని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికీ అంతా మిస్టరీనే. అయితే, గ్రహాంతరవాసులు వారంతా అప్పుడప్పుడు భూమిపైకి వస్తారని.. పలుచోట్ల యూఎఫ్‌ఓలను చూసినట్లుగా పలువురు పేర్కొన్న సందర్భాలు ఎన్నో చూశాం. గతంలో నాసాకు చెందిన పైలెట్లు కూడా తాము యూఎఫ్ఓలను గుర్తించినట్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నది.

వివరాల్లోకి వెళితే.. కెనడాకు చెందిన జస్టిస్‌ స్టీవెన్సన్‌, డానియెల్లె స్టీవెన్సన్‌ దంపతులు మనిటోబాలోని ఫోర్ట్‌ అలెగ్జాండర్‌ వద్ద పెన్నిపెగ్‌ రివర్‌ సమీపంలో కారులో ప్రయాణిస్తున్నారు. వారికి నదిపై దూరంగా రెండు వెలుగుతున్న అగ్నిగోళాల వంటి ఆకృతులు కనిపించాయి. ఆయా దృశ్యాలను తమ మొబైల్‌లో బంధించారు. భానుడిలా భగభగమండుతున్న ఆ వింత వస్తువులు ఆ తర్వాత అకస్మాత్తుగా ఆకాశంలో ప్రత్యక్షమయ్యాయని, కారును నిలిపి వాటిని చిత్రీకరించామని పేర్కొన్నారు. ఆ రెండింటిని వీడియో తీస్తుండగా.. మరో రెండు ఆకృతులు కనిపించాయని చెప్పారు. తాము మొత్తానికి ఏవో విచిత్రమైన వస్తువులను చూశామని, అవేంటో తెలియాల్సి ఉందని జస్టిన్ స్టీవెన్సన్ పేర్కొన్నాడు. బహుశా మేము చూసింది ఏలియన్స్‌ని కావొచ్చంటూ అని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. అయితే, ఆ కాంతి ఏంటన్ని తెలియరాలేదు. పలువురు అవి యూఎఫ్‌ఓలు కావొచ్చని అభిప్రాయపడ్డారు.

 

Latest News