Site icon vidhaatha

చావైన..బతుకైనా..అన్నీ అమ్మతోనే..

విధాత‌: ఎంత కష్టమొచ్చినా బిడ్డను కడుపులో దాచుకునే అమ్మల కథలు విన్నాం.. ఇది అలాంటి అమ్మ కథ కాదు.. కష్టంలో ఉన్న అమ్మను కడవరకు వీడని ఓ బిడ్డ వ్యథ.. తల్లి ప్రాణాలను చిరుత పట్టుకుపోతుంటే… వదలలేక.. ఏం చేయాలో పాలుపోక.. ఆ అమ్మనే గట్టిగా పెనవేసుకున్న ఈ చిన్నారి వానర చిత్రం ప్రతి ఒక్కరి గుండెను మెలిపెట్టేసింది.జాంబియాలోని నేషనల్‌ పార్క్‌లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక సన్నివేశాన్ని షఫీక్‌ ముల్లా అనే ఫొటోగ్రాఫర్‌ క్లిక్‌మనిపించారు. చివర్లో ఈ పిల్లను కూడా చిరుత చంపేసిందని ఆయన తెలిపారు.

Exit mobile version