Site icon vidhaatha

Snake Video Viral | మహా శివుడికి నాగాభరణం..వైరల్ గా వీడియో

Snake Video Viral | శివలింగాల చుట్టు అక్కడక్కడా నాగు పాములు పడగవిప్పి దర్శనమిచ్చే అరుదైన ఘటనలు అడపదడపా చూస్తుంటాం. అయితే ఓ చోట నాగుపాము భారీ శివుడి విగ్రహంపైకి ఎక్కి నిజమైన నాగాభరణంగా ఫోజులిచ్చిన ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నాగుపాము తాను ఆ శంకరయ్య నాగాభరణాన్ని అన్న సంగతి తెలుసుకుందో లేక నేనుండగా మహాశివుడి విగ్రహం మెడలో బొమ్మ పాము ఎందుకనుకుందో గాని ఏకంగా తానే విగ్రహంపైకి వెళ్లిందని భక్తులు చర్చించుకున్నారు.

శివుడి విగ్రహం మెడలో ఉన్న నాగుపాము మాదిరిగా తాను కూడా అదే భంగిమలో పడగవిప్పి ఫోజులిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదంతా చూసిన భక్తులు నాగయ్య దర్శనం అయ్యిందని..ఇదంతా ఆ పరమేశ్వరుడి మహిమ అని..నిజమైన నాగ భరణంతో మహదేవుడిని దర్శించుకోవడం మా అదృష్టమంటూ భక్తీ పారవశ్యంలో తెలిపోయారు. నాగయ్య మాత్రం తన భక్తిని చాటుకుంటూ నాగాభరణం పాత్రను నిర్వహించి తన దారిన తాను వెళ్లిపోయింది. ఇదంతా కొందరు భక్తులు వీడియో తీసి ఎక్స్ లో పోస్టు చేశారు. ఇంకేముంది ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కొండ ప్రాంతాల్లో ఉన్న ‘తాలే వాలే మహాదేవ్’ అని కూడా పిలువబడే శ్రీ నాథేశ్వర్ మహాదేవ్ పురాతన శివాలయంలో జరిగినట్లుగా సమాచారం.

Exit mobile version