Viral news : ఈ మధ్య కాలంలో రీల్స్ పైన, ఫొటోషూట్‌ల పైన మోజు బాగా పెరిగిపోయింది. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సైతం రీల్స్, ఫొటోషూట్స్ అంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్ కోసం, ఫొటోషూట్స్ కోసం ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చాలా జరిగాయి. చాలా మంది గాయాలపాలయ్యారు. ఇలాంటి ఘటనలను కళ్లారా చూస్తున్నా, చెవులారా వింటున్నా కొందరిలో మార్పు రావడంలేదు. రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఫోటోషూట్ మోజు భార్యాభర్తల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. చావు తప్పినా తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
రైల్వే బ్రిడ్జిపై ప్రమాదకర రీతిలో నిర్వహిస్తున్న ఫొటోషూట్ ఆ భార్యాభర్తల ప్రాణాల మీదకు తెచ్చింది. రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలని గోరంఘాట్ బ్రిడ్జిపై దంపతులు రాహుల్, జాన్వి ఫోటోషూట్ చేస్తున్నారు. ఇంతలో రైలు రావడంతో వారు ప్రాణ భయంతో 90 అడుగుల లోతున్న లోయలోకి దూకారు. రైలు వేగం తక్కువగా ఉండటంతో లోకో పైలెట్ కూడా ట్రెయిన్‌ను ఆపేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని లోయలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో భార్య కాలు విరిగింది. భర్త వెన్నుముకకు తీవ్ర గాయమైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. రాహుల్ మేవాడ (22), జాన్వీ (20) బాగ్దినగర్ వాసులు. గోరంఘాట్‌కు బైకుపై వెళ్లారు. అక్కడ హెరిటేజ్ బ్రిడ్జిపై మీటర్ గేజ్ ట్రెయిన్ వెళ్లేందుకు ట్రాక్‌వేసి ఉంది. దానిపై ఫొటోషూట్ చేస్తే థ్రిల్లింగ్ ఉంటుందని దంపతులు భావించారు. ఇద్దరూ కలిసి ఫోటోషూట్‌లో మునిగిపోయారు. ఇంతలో ఊహించని విధంగా ఆ ట్రాక్‌పైకి రైలు దూసుకొచ్చింది. దాంతో రాహుల్ దంపతులు బిత్తరపోయారు. ఏం చేయాలో వారికి అర్థంకాలేదు. రైలు ఎక్కడ తమను గుద్దేస్తుందోననే భయంతో వెంటనే 90 అడుగుల లోతున్న లోయలోకి దూకేశారు.
राजस्थान के पाली जिले में एक बड़ा हादसा हुआ। राहुल मेवड़ा अपनी पत्नी जाह्नवी संग हेरिटेज पुल पर फोटो शूट करा रहे थे। तभी ट्रेन आ गई। ट्रेन से बचने को दोनों 90 फीट गहरी खाई में कूद गए। दोनों का इलाज जारी है।
🚨Disturbing Visual🚨 pic.twitter.com/WwDSTd5jrW
— Sachin Gupta (@SachinGuptaUP) July 14, 2024
భార్యాభర్తలు ఇద్దరు చేతులు పట్టుకుని ట్రాక్‌పై నుంచి లోయలోకి దూకడం వీడియోలో ఉంది. కాగా రాహుల్‌తోపాటు అతడి సోదరి, ఆమె భర్త కూడా అక్కడే ఉన్నారు. వారు కూడా ఫొటోషూట్‌లోనే ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు లక్కీగా వారు ట్రెయిన్ రావడం గమనించి అక్కడి నుంచి తప్పించుకున్నారు. బ్రిడ్జిపై ఉన్న జంటను గుర్తించిన లోకో పైలట్ రైలుకు బ్రేక్ వేశాడు. దాంతో బ్రిడ్జిపై రైలు ఆగిపోయింది. కానీ అప్పటికే తీవ్ర భయాందోళనకు గురైన దంపతులు బ్రిడ్జి పైనుంచి దూకేశారు. దాంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. కానీ బ్రిడ్జిపైనే ఉండి ఉంటే గాయపడే వారు కాదని అధికారులు చెప్పారు.