World Short River | ప్రపంచంలోనే అతిచిన్న నది పేరేంటో తెలుసా..? అది ఎక్కడ ఉందంటే..?

Word Small River | ప్రపంచంలో అత్యంత పొడవైనా నది ఏదీ అని అడిగితే అందరూ టక్కున నైలునది అని చెప్పేస్తారు. మరి ప్రపంచంలోనే అతి చిన్న నది ఏదీ అంటే? ఆలోచిస్తుంటారు. అలాంటి నదులు కూడా ఉంటాయా? అంటూ అవాక్కవుతారు. అవును ప్రపంచంలోనే అతి చిన్న నది అమెరికాలోని మోటానారోలో ఉన్నది.

  • Publish Date - May 11, 2024 / 12:30 PM IST

World Short River  | ప్రపంచంలో అత్యంత పొడవైనా నది ఏదీ అని అడిగితే అందరూ టక్కున నైలునది అని చెప్పేస్తారు. మరి ప్రపంచంలోనే అతి చిన్న నది ఏదీ అంటే? ఆలోచిస్తుంటారు. అలాంటి నదులు కూడా ఉంటాయా? అంటూ అవాక్కవుతారు. అవును ప్రపంచంలోనే అతి చిన్న నది అమెరికాలోని మోటానారోలో ఉన్నది. ఈ నదిపేరు రో (ROE). ఇది కేవలం 201 అడుగుల దూరం మాత్రమే ప్రవస్తుంది. జెయింట్ స్ప్రింగ్స్, మిస్సౌరీ నది మధ్య జస్ట్ 61 మీటర్ల దూరం వరకు మాత్రమే ప్రవాహం కొనసాగుతున్నది.

ఈ నదికి ఉన్న ప్రత్యేకతో 1989లోనే గిన్నిస్ బుక్‌లోకి సైతం ఎక్కేసింది. అంతకుముందు ఈ రికార్డు అమెరికాలోని ఓరెగావ్ రాష్ట్రంలో ఉన్న లింకన్ సిటీలో ‘డీ’ నది పేరిట ఉండేది. దాని పొడవు 440 అడుగులే. అంటే దాదాపు 134 మీటర్లు. అయితే, రికార్డు తమ నదికే చెందాలంటూ ఇరు ప్రాంతాల వారు పట్టబట్టడంతో 2006లో గిన్నిస్ నిర్వాహకులు ఈ కేటగిరీని ఎత్తివేసినట్లు సమాచారం. కానీ, వరల్డ్ అట్లాస్ ప్రకారం.. రో నదికన్నా మరో రెండు చిన్న నదులు కూడా ఉన్నాయి. ఇండోనేసియాలోని తాంబొరాసి నది, నార్వేలోని కోవస్సెల్వా నది పొడవు కూడా అత్యల్పంగా 65.6 అడుగులే అంటే కేవలం కేవలం 20 మీటర్ల దూరమే ప్రవహిస్తుండడం విశేషం.

చాలామందిలో అనుమానం ఉంటుంది. కేవలం 65 అడుగుల దూరం వరకే ప్రవహిస్తుందా? అలా ప్రవహిస్తే నది అని పలుస్తారా? అనే అనుమానాలు కలుగడం సహజమే. అయితే, అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం ఒక నది అంటే దానిలో నిరంతర ప్రవాహం ఉండాలి. అందులోని నీరు సముద్రంలో, లేదంటే మరో నదిలో కలవాలి. సాధారణంగా వాగులు, వంకలు కలసి సెలయేళ్లుగా మొదలవుతాయి. ఈ సెలయేళ్లన్నీ కలిసి నదులుగా మారతాయి. ఈ నదులన్నీ ఎత్తయిన ప్రదేశాల నుంచి దిగువకు ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంటాయి.

Latest News