Bra valley | ఒంటిపై ‘బ్రా’లను తీసి ఇనుప కంచెకు వేస్తున్న యువతులు.. ఎందుకో తెలుసా..?

Bra valley | అక్కడ ఇనుప కంచెకు 'బ్రా'లు వేలాడదీసి కనిపిస్తాయి. ఇనుప కంచె పొడుగూత రంగురంగుల 'బ్రా'లు దర్శనమిస్తాయి. ఎందుకంటే అక్కడికి వెళ్లిన యువతులు తప్పకుండా ఇలా 'బ్రా'లను వేలాడదీస్తారట. అందుకే ఆ ఇనుపకంచె నిండుగా 'బ్రా'లే కనపడుతాయి. అలా 'బ్రా'లను వేలాడదీయడం వెనుక ఓ పెద్ద కారణమే ఉన్నదట. ఆ వివరాలేమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

  • Publish Date - June 28, 2024 / 10:00 AM IST

Bra valley : అక్కడ ఇనుప కంచెకు ‘బ్రా’లు వేలాడదీసి కనిపిస్తాయి. ఇనుప కంచె పొడుగూత రంగురంగుల ‘బ్రా’లు దర్శనమిస్తాయి. ఎందుకంటే అక్కడికి వెళ్లిన యువతులు తప్పకుండా ఇలా ‘బ్రా’లను వేలాడదీస్తారట. అందుకే ఆ ఇనుపకంచె నిండుగా ‘బ్రా’లే కనపడుతాయి. అలా ‘బ్రా’లను వేలాడదీయడం వెనుక ఓ పెద్ద కారణమే ఉన్నదట. ఆ వివరాలేమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

అది న్యూజిలాండ్‌ దేశంలోని కార్‌డ్రోనా ప్రాంతం. ఈ కార్‌డ్రోనా సెంట్రల్‌ ఒటాగోలోని అందమైన పర్యాటక ప్రదేశం. కొండలుగుట్టలు, లోయలతో అందంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశంలోని లోయ ప్రాంతంలో ఓ ఇనుప కంచె ఉంటుంది. అక్కడ పర్యటనకు వెళ్లిన యువతులు ఆ ఇనుప కంచె ముందు నిలబడి తమ ఒంటిపై ఉన్న ‘బ్రా’ తీసి దానికి వేలాడదీస్తారు.

ఇలా యువతులు తమ ‘బ్రా’లను ఆ ఇనుప కంచెకు వేలాడదీయడంవల్ల వారు కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తాడని నమ్మకం. ఇలా యువతులు ‘బ్రా’లను వేలాడదీసే సంప్రదాయం కారణంగా ఆ ప్రాంతానికి బ్రా వ్యాలీగా పేరుపడింది. ముందుగా స్థానికుల్లో మాత్రమే ఈ సంప్రదాయంపైన విశ్వాసం ఉండేది. అందుకే వాళ్లు మాత్రమే ‘బ్రా’లను వేలాడదీసేవారు.

కానీ, అది పర్యాటక ప్రాంతం కావడంతో రానురాను అందరికీ ఆ సంప్రదాయం గురించి తెలిసిపోయింది. ఈ కారణంగా కూడా అక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఇప్పుడు దేశవిదేశాల పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువతులు ఆ ఇనుప కంచె దగ్గరికి వెళ్లి.. వారు వేసుకున్న ‘బ్రా’ తీసి అక్కడ వేలాడదీసి వస్తున్నారు.

Latest News