Seals life style | ఆ పని కోసం సీల్స్‌ చప్పట్లతో సంకేతాలిస్తాయట.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడి..!

Seals life style | సీల్స్..! ఇవి స‌ముద్ర జీవులు. వీటి దేహం కింద ముందువైపు రెండు, వెనుకవైపు రెండు కాళ్లు, చేతుల మాదిరిగా తెడ్ల లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి సీల్స్‌ ఈదడానికి తోడ్పడుతాయి. ఈ సీల్స్ వివిధ రంగుల్లో ఉంటాయి. వాటిలో బూడిదరంగు సీల్స్‌ (గ్రే సీల్స్‌)పై జ‌రిగిన అధ్యయ‌నంలో ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు వెల్లడయ్యాయి. మగ సీల్స్‌ విరహంతో ఉన్నప్పుడు ఆడ సీల్స్‌కు చ‌ప్పట్లతో సంకేతాలిస్తాయ‌ట‌. ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం గ్రే సీల్స్‌పై అధ్యయ‌నం చేసి ఈ విష‌యాన్ని వెల్లడించింది.

  • Publish Date - June 1, 2024 / 10:32 AM IST

Seals life style : సీల్స్..! ఇవి స‌ముద్ర జీవులు. వీటి దేహం కింద ముందువైపు రెండు, వెనుకవైపు రెండు కాళ్లు, చేతుల మాదిరిగా తెడ్ల లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి సీల్స్‌ ఈదడానికి తోడ్పడుతాయి. ఈ సీల్స్ వివిధ రంగుల్లో ఉంటాయి. వాటిలో బూడిదరంగు సీల్స్‌ (గ్రే సీల్స్‌)పై జ‌రిగిన అధ్యయ‌నంలో ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు వెల్లడయ్యాయి. మగ సీల్స్‌ విరహంతో ఉన్నప్పుడు ఆడ సీల్స్‌కు చ‌ప్పట్లతో సంకేతాలిస్తాయ‌ట‌. ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం గ్రే సీల్స్‌పై అధ్యయ‌నం చేసి ఈ విష‌యాన్ని వెల్లడించింది.

సీల్స్‌లో సాధార‌ణంగా మగ జీవి 150 నుంచి 300 కిలోల బరువుతో రెండున్నర మీటర్ల వరకు పొడ‌వు ఉంటుంది. ఆదేవిధంగా ఆడ జీవి 100 నుంచి 200 కిలోల బరువుతో రెండు మీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. వీటి దేహం కింద భాగంలో ముందువైపు ఒక జత చేతుల్లాగా, వెనుకవైపు ఒక జత కాళ్లలాగా ప్రత్యేక అవయవాలు ఉంటాయి. సీల్స్ నీటిలో ఈద‌డానికి తోడ్పడే ఈ కాళ్లు, చేతుల లాంటి అవయవాలకు వేళ్లు ఉండవు. మొండిగా తెడ్లలాగా ఉంటాయి.

గ్రే సీల్స్ ముందువైపు చేతుల మాదిరిగా ఉన్న అవయవాలను ఉపయోగించి చ‌ప్పట్లు కొడుతాయ‌ట‌. సాధారణంగా జంతుప్రదర్శన శాలల్లోని నీటిలో ఉండే సీల్స్ కూడా‌ చప్పట్లు కొడుతాయి. అయితే సందర్శకుల ఆనందం కోసం జూ నిర్వాహకులు ఇచ్చే ప్రత్యేక‌ శిక్షణతో వాటికి ఆ చప్పట్లు కొట్టడం అనే లక్షణం అలవడుతుంది. కాబ‌ట్టి అందులో వింతేమీ లేదు. కానీ స‌ముద్రాల్లో నివసించే గ్రే సీల్స్‌కు‌ ఎలాంటి శిక్షణ లేకపోయినా చప్పట్లు కొట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం.

పైగా గ్రే సీల్స్‌ కొట్టే చప్పట్ల శబ్దం మామూలుగా ఉండదట. నీటి లోపలిభాగంలో ఎలాంటి గాలి లేనప్పటికీ.. సీల్స్‌ చప్పట్లు కొడితే తుపాకీ పేలినంత పెద్దగా శబ్దం వస్తుందట. సాధార‌ణంగా క‌మ్యూనికేష‌న్ కోసం సీల్స్ ర‌క‌ర‌కాల శ‌బ్దాలు చేస్తాయ‌ట‌. అయితే ఈ చప్పట్లు కొట్టడం అనే లక్షణం కూడా కమ్యూనికేషన్‌ కోసమే అయినా.. దానికి ప్రత్యేక అర్థం ఉందట. మగ సీల్‌ చప్పట్లు కొట్టిందంటే అది తీవ్రమైన లైంగిక కోరికతో ఉందని అర్థమట. సంగమం కోసం ఆడ జీవిని కోరుకుంటున్నట్లట.

అయతే మగ గ్రే సీల్స్‌ కొట్టే ఈ చప్పట్లలో రెండు సంకేతాలు ఉంటాయట. అందులో ఒకటి సాటి మగ సీల్స్‌కు హెచ్చరిక కాగా, మరొకటి పరిసరాల్లోని ఆడ సీల్స్‌కు ఆహ్వానమట. ఈ చప్పట్లలో సాటి మగ సీల్స్‌కు ‘నేను చాలా బలవంతుడిని. నా దరిదాపుల్లోకి ఎవరూ రావద్దు. వచ్చారంటే ఖతమే’ అనే హెచ్చరిక ఉంటుందట. తాను ఆడ సీల్‌ను సమీపించడానికి ముందే దాని చుట్టుపక్కల ఉన్న ఇతర మగ సీల్స్‌ను భయపడి పారిపోవడానికి అలా చేస్తుందట.

ఇక ఆడ సీల్స్‌కు ‘నేను చాలా బలవంతుడిని. నాలో చాలా చక్కని జీన్స్‌ ఉన్నాయి. నాతో సంగమం సంతృప్తినిస్తుంది’‌ అనే సంకేతం ఉంటుందట. మీతో సంగమానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ తన దగ్గర్లో ఉన్న ఆడ సీల్స్‌ను ఆకర్షించడానికి ఇలా చప్పట్లు కొడుతుందట. అందుకే మగ సీల్‌ చప్పట్ల శబ్దం వినగానే దానికంటే బలహీనంగా ఉండే ఇతర మగ సీల్స్‌ అక్కడి నుంచి పారిపోతాయట. కోరికతో ఉన్న ఆడ సీల్ వచ్చి దాని సరసన చేరుతుందట.

ఆ త‌ర్వాత అవి సంగ‌మ క్రీడ‌లో మునిగి తేలుతాయ‌ట‌. కాగా, చప్పట్లు కొట్టడం అనేది గ్రే సీల్స్‌లో అతి ముఖ్యమైన సామాజిక ప్రవర్తన అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ డేవిడ్‌ హాకింగ్‌. ముఖ్యమైన విషయం ఏందంటే.. గ్రే సీల్ చప్పట్లు కొట్టే దృశ్యాన్ని తన కెమెరాలో బంధించడం కోసం బ్రిటన్‌కు చెందిన ప్రకృతి ప్రేమికుడు డాక్టర్‌ బెన్‌ బర్విల్లే 17 ఏండ్లు శ్రమించాల్సి వచ్చిందట. చివరికి ఆ చప్పట్లను బంధించి అందరికీ అందించగలిగారు.

Latest News