Anti Pee paint | ఆ గోడలపై మూత్రం పోస్తే తిరిగొచ్చి మీ మీదే పడుతుంది.. ఎందుకో తెలుసా..?

Anti Pee paint : సాధారణంగా మగవాళ్లు చాలామంది బయటికి వెళ్లినప్పుడు మూత్రం ఆత్రంగా వస్తే బాత్రూమ్‌ల గురించి ఆలోచించరు. బాత్రూమ్‌ల కోసం వెతకడం కంటే గోడకేసి పాట పాడటమే మేలని భావిస్తారు. బాటసారులుగానీ, బైకర్‌లుగానీ, మరే ఇతర వాహనాల్లో వెళ్లేవారుగానీ ఖాళీ గోడ కనపడిందంటే వాహనం ఆపేసి పని కానిచ్చేస్తారు. దాంతో నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయి. భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతాయి. దాంతో ఆయా ప్రదేశాల గుండా వెళ్లాలంటే ముక్కులు మూసుకుని నడవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది.

  • Publish Date - June 2, 2024 / 01:00 PM IST

అయితే ఈ కంపు సమస్యకు చెక్‌పెట్టేందుకు లండన్‌లోని సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ అయిన వెస్ట్‌మినిస్టర్‌ సిటీ అధికార యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎవరైనా గోడలపై మూత్ర విసర్జన చేస్తే అది తిరిగి వాళ్ల మీదే పడేలా ప్లాన్‌ చేసింది. ఇందుకోసం ‘యాంటీ పీ-పెయింట్‌’ను గోడలపై స్ప్రే చేసింది. వెస్ట్‌మినిస్టర్‌ సిటీలోని అన్ని రద్దీ ప్రదేశాల్లో గోడలపై ఈ యాంటీ పీ-పెయింట్‌ను స్ప్రే చేయించారు.

ఈ యాంటీ పీ-పెయింట్‌ స్ప్రే చేసిన గోడలపై ఎవరైనా మూత్రవిసర్జనకు ప్రయత్నిస్తే అది తిరిగి మూత్రం పోస్తున్న వ్యక్తిపైనే పడుతుంది. దాంతో గోడలపై మూత్రవిసర్జన చేసేవాళ్లు షాకవక తప్పదు. అయితే ఈ గోడలపై తెలియక మూత్రవిసర్జన చేసే పరిస్థితి ఉండదట. ఎందుకంటే ఈ పెయింట్‌ వేసిన గోడలపై ‘దిస్‌ వాల్‌ ఈజ్‌ నాట్‌ ఎ యూరినల్‌’ అని హెచ్చరికలు రాసిపెడుతున్నారట. అంటే హెచ్చరికను లెక్క చేయకుండా మూత్రవిసర్జనకు ప్రయత్నించేవారు మాత్రమే ఈ యాంటీ పీ-పెయింట్‌తో అబాసుపాలు కావాల్సి వస్తుందన్నమాట.

అయితే వెస్ట్‌మినిస్టర్‌ సిటీ కౌన్సిల్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి పరిశుభ్రత ఒక్కటే కారణం కాదట. ఖర్చును తగ్గించుకోవడం కూడా ఒక కారణమట. ఆ జిల్లాలో యూరినేటెడ్‌ గోడలను శుభ్రం చేయించడానికి ఏటా 12.4 లక్షల డాలర్‌లు ఖర్చవుతున్నదట. అందుకే యాంటీ పీ-పెయింట్ ద్వారా ఆ ఖర్చు తగ్గే చాన్స్‌ ఉందని వెస్ట్‌మినిస్టర్‌ అధికారులు భావిస్తున్నారట.

Latest News