Saudi Arabia | 256 కిలోమీటర్ల హైవేలో ఒక్క మలుపు లేదట..!

Saudi Arabia | చాలా ప్రాంతాల్లో హైవేల్లో ప్రయాణం చేసిన మూలమలుపులు సర్వసాధారణంగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ మలుపులూ ప్రమాదకరంగానూ లేకపోలేదు. కానీ, 256 కిలోమీటర్ల దూరం వరకు ఏ ఒక్క చిన్న మలుపులు లేకుండా హైవేను నిర్మించారు. ఇది మన దగ్గర మాత్రం కాదు! ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో. రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా 256 కిలోమీటర్ల పొడువనా మలుపులేవీ లేకుండా హైవే-10ని నిర్ణయించారు.

  • Publish Date - May 16, 2024 / 09:30 AM IST

Saudi Arabia | చాలా ప్రాంతాల్లో హైవేల్లో ప్రయాణం చేసిన మూలమలుపులు సర్వసాధారణంగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ మలుపులూ ప్రమాదకరంగానూ లేకపోలేదు. కానీ, 256 కిలోమీటర్ల దూరం వరకు ఏ ఒక్క చిన్న మలుపులు లేకుండా హైవేను నిర్మించారు. ఇది మన దగ్గర మాత్రం కాదు! ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో. రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా 256 కిలోమీటర్ల పొడువనా మలుపులేవీ లేకుండా హైవే-10ని నిర్ణయించారు. చమురు, గ్యాస్ నిల్వల నగరమైన హరద్ నుంచి పొరుగన ఉండే యూఏఈ సరిహద్దు ప్రాంతం అల్ బతా వరకు ఈ హైవేను నిర్మించారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలోని 146 కిలోమీటర్ల ఐర్ హైవే పేరుతో ఈ రికార్డు ఉండేది. ప్రస్తుతం ఈ ఘనతను సౌదీలోని హైవే-10 బద్దలు కొట్టినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.

దేశ రాజు అబ్దుల్లా కోసం తొలుత దీన్ని ప్రైవేటు రోడ్డుగా ప్రత్యేకంగా నిర్మించారని.. అయితే ప్రస్తుతం చమురు రవాణాకు దీన్ని వినియోగిస్తున్నట్లుగా తెలిపింది. అలాగే, ఈ హైవే నిటారుగా ఉండటమే కాదు.. మొత్తం 256 కిలోమీటర్ల మార్గంలో ఎత్తుపల్లాలు కూడా ఉండవని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ పేర్కొంది. కానీ, దారిలో ఎక్కడా ఒక్క చెట్టు కానీ కట్టడం కనిపించదు. రోడ్డుపై వాహనాలు కేవలం 2 గంటల వ్యవధిలోనే 256 మీటర్ల దూసుకువెళ్లగలిగేలా ఈ రోడ్డును నిర్మించారు. అయితే, అక్కడక్కడ రోడ్డుపై ఒంటెలు, కంగారూలు మాత్రం ఉన్నట్టుండి రోడ్డు దాటుతుంటాయని.. దాంతో వాహనదారులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని dangerousroads.org అనే వెబ్‌సైట్ హెచ్చరించింది.

Latest News