Black Taj Mahal : ఆగ్రాలో షాజహాన్ కట్టించిన తాజ్‌మహల్ గురించి దాదాపు అందరికీ తెలుసు. కానీ ఈ బ్లాక్ తాజ్‌మహల్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఆగ్రాలోని తాజ్‌మహల్ మాదిరిగానే ఈ బ్లాక్ తాజ్‌మహల్ కూడా ప్రేమకు చిహ్నం. ఆ తాజ్‌మహల్ లాగానే ఈ తాజ్‌మహల్ కూడా అద్భుతమైన కట్టడం. అయితే పరిమాణంలో మాత్రం బ్లాక్ తాజ్‌మహల్ చిన్నదిగా ఉంటుంది. ఈ బ్లాక్ తాజ్‌మహల్ స్ఫూర్తితోనే షాజహాన్ ముంతాజ్ కోసం ఆగ్రాలో తాజ్‌మహల్ కట్టించాడు. ఇంతకూ ఈ బ్లాక్ తాజ్‌మహల్ ఎక్కడ ఉన్నది. ఇది ఎవరి ప్రేమకు చిహ్నం..? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
పెద్దగా ప్రాచుర్యంలోకి రాకుండా ఉండిపోయిన ఈ నల్లరాతి తాజ్‌మహల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రక నగరం బుర్హాన్‌పూర్‌లో ఉన్నది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ నల్లరాతి తాజ్‌మహల్‌ను చూసిన తరువాతే ఆగ్రాలో అదే రీతిలో పాలరాతి తాజ్ మహల్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడట. బుర్హాన్‌పూర్‌లోని ఉతావలి నది ఒడ్డున ఉన్న ఈ నల్లరాతి తాజ్ మహల్ ఉంది. ఈ తాజ్‌మహల్‌ను నిర్మించింది కూడా మొఘల్ చక్రవర్తే.
మొఘల్ చక్రవర్తి జహంగీర్.. తన మనవడు షానవాజ్ ఖాన్, షానవాజ్ సతీమణిల మధ్య ప్రేమను భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ బ్లాక్ తాజ్‌మహల్‌ను నిర్మించాడట. జహంగీర్ మనవడు షానవాజ్ ఖాన్ 44 ఏండ్ల వయస్సులోనే మరణించడంతో.. భర్త మరణం తట్టుకోలేక కొన్ని రోజులకే అతని భార్య కూడా మరణించిందట. దాంతో జహంగీర్ ఇద్దరినీ పక్కపక్కనే సమాధి చేయించి బ్లాక్ తాజ్‌మహల్ నిర్మించాడట. 1622-1623 మధ్య కాలంలో ఈ తాజ్‌మహల్ నిర్మాణం జరిగిందట.
ప్రత్యేకతలు..
ఆగ్రాలోని పాలరాతి తాజ్ మహల్ కంటే ఈ నల్లరాతి తాజ్ మహల్ చిన్నది. నల్లరాతితో నిర్మించిన ఈ తాజ్‌మహల్ షానవాజ్ ఖాన్‌కు, ఆయన భార్యకు మధ్య ఉన్న ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. ఈ తాజ్‌మహల్‌ను పురావస్తు శాఖ పర్యవేక్షిస్తున్నది.
ఈ బ్లాక్ తాజ్‌మహల్ మినార్‌లు కూడా పాలరాతి తాజ్ మహల్ మినార్‌ల మాదిరిగానే ఉంటాయి. ఈ నల్లరాతి తాజ్ మహల్ చూడటానికి కూడా మన దేశం నుంచే గాక విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ తాజ్ మహల్ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఒక అద్భుతమైన కట్టడం.
ఇవి కూడా చదవండి