Fish Sound | పిట్ట కొంచెం కూత ఘనం.. ఈ చేప చేసే శబ్దానికి చెవులకు చిల్లులు పడాల్సిందే..!

Fish Sound | కొన్ని పక్షులు చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ పెద్దగా శబ్దాలు చేస్తాయి. అందుకే ఎవరైనా చిన్నపిల్లలు గట్టిగా మాట్లాడితే 'పిట్ట కొంచెం కూత ఘనం' అనే సామెత ఉపయోగిస్తుంటాం. అయితే పిట్టలు శబ్దాలు చేసే సంగతి అందరికీ తెలుసు. కానీ కొన్ని చేపలు కూడా శబ్దాలు చేస్తాయనే సంగతి చాలామందికి తెలియదు. ముఖ్యంగా కేవలం 10 నుంచి 12 మిల్లీమీటర్లు మాత్రమే ఉండే ఒక రకం చిన్న చేపలు చేసే శబ్దం గురించి ఎవ్వరికీ తెలిసి ఉండదు.

  • Publish Date - June 30, 2024 / 08:27 AM IST

Fish Sound : కొన్ని పక్షులు చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ పెద్దగా శబ్దాలు చేస్తాయి. అందుకే ఎవరైనా చిన్నపిల్లలు గట్టిగా మాట్లాడితే ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనే సామెత ఉపయోగిస్తుంటాం. అయితే పిట్టలు శబ్దాలు చేసే సంగతి అందరికీ తెలుసు. కానీ కొన్ని చేపలు కూడా శబ్దాలు చేస్తాయనే సంగతి చాలామందికి తెలియదు. ముఖ్యంగా కేవలం 10 నుంచి 12 మిల్లీమీటర్లు మాత్రమే ఉండే ఒక రకం చిన్న చేపలు చేసే శబ్దం గురించి ఎవ్వరికీ తెలిసి ఉండదు.

ఈ చేపలు చాలా చిన్నవిగా అందంగా ఉంటాయి. నీటిలో తలతలా మెరుస్తూ చూడచక్కగా కనిపిస్తాయి. చూడటానికి ఇంత చిన్నగా ఉండే ఈ చేపలు చేసే శబ్దానికి చెవులు చిల్లులు పడాల్సిందే. ఈ చేపలకు శాస్త్రవేత్తలు ‘డేనియోనెల్లా సరీబ్రమ్‌’ అని పేరుపెట్టారు. వీటి నుంచి వెలువడే శబ్దం 140 డెసిబుల్స్‌ వరకు ఉంటుంది. సాధారణంగా మనిషి చెవులు 70 డెసిబుల్స్‌ వరకు శబ్దాన్ని భరించగలవు. అంతకు రెట్టింపు స్థాయిలో కూత పెట్టగలగడమే ఈ చిన్నచిన్న చేపల ప్రత్యేకత.

వీటి శబ్దం దాదాపు జెట్‌ విమాన శబ్దంతో సమానంగా ఉంటుందట. ఈ చేపలను తొలిసారిగా 1980లలో గుర్తించారు. అయితే ఈ చేపలనే పోలిన ‘డేనియోనెల్లా ట్రాన్స్‌లూసిడా’ అనే మరో రకం చేపలు కూడా ఉండటంతో శాస్త్రవేత్తలు ఈ చిన్నచేపల లక్షణాలను నిర్దిష్టంగా గుర్తించడంలో కొంత గందరగోళానికి లోనయ్యారు. మూడేళ్ల కిందట ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వీటిపై పరిశోధనలు జరిపి, వీటి కూత శక్తిని తెలుసుకుంది.

ఈ చేపల గొంతు దగ్గర ధ్వనికండరాలు, మృదులాస్థి ప్రకంపనల ద్వారానే ఈ చేపలు భారీ శబ్దాలు చేయగలుగుతున్నాయని, చెవులు చిల్లులు పడే స్థాయిలో కూత పెట్టగలుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. వీటి కూత ముందు సింహగర్జన కూడా బలాదూరేనట. సింహగర్జన శబ్దం 114 డెసిబుల్స్‌ అయితే.. ఈ చేపల కూత శబ్దం 140 డెసిబుల్స్‌. ఇంతకు మించిన శబ్దం చేసే జీవి ప్రపంచంలో మరేదీ లేదు.

Latest News