Snake Free City | భారత్‌లో పాములు లేని ప్రదేశం ఉందని మీకు తెలుసా..? ఇక్కడ చూద్దామన్న కుక్కలు కూడా కనిపించవు..!

Snake Free City | పాముల పేరు చెబితేనే చాలా మంది ఆమడదూరం పరుగుత్తుతారు. మరికొందరు వణికిపోతారు. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన వాటిలో పాము ఒకటి. దేశవ్యాప్తంగానే అనేక ప్రాంతాల్లో పాములు కనిపిస్తుంటాయి. దేశంలో భారతదేశంలో 350 రకాల పాములున్నాయి. చాలా రాష్ట్రాల్లో అనేక ర‌కాల పాములు ఉండగా.. కేర‌ళ రాష్ట్రాన్ని పాముల నిలయంగా పేర్కొంటున్నారు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పాములు కనిపిస్తాయి.

  • Publish Date - May 20, 2024 / 11:30 AM IST

Snake Free City | పాముల పేరు చెబితేనే చాలా మంది ఆమడదూరం పరుగుత్తుతారు. మరికొందరు వణికిపోతారు. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన వాటిలో పాము ఒకటి. దేశవ్యాప్తంగానే అనేక ప్రాంతాల్లో పాములు కనిపిస్తుంటాయి. దేశంలో భారతదేశంలో 350 రకాల పాములున్నాయి. చాలా రాష్ట్రాల్లో అనేక ర‌కాల పాములు ఉండగా.. కేర‌ళ రాష్ట్రాన్ని పాముల నిలయంగా పేర్కొంటున్నారు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పాములు కనిపిస్తాయి. ఇక దేశంలోని పాములు కనిపించని ప్రదేశం ఉన్నదా? అంటే.. ఉన్నది. ఈ ప్రాంతాన్ని కూడా పాములు లేని ప్రదేశంగానూ ప్రకటించారు.

అదే లక్షద్వీప్‌. ఇక్కడ పాములు కనిపించవు. అందుకే లక్షద్వీప్‌ని స్నేక్‌ ఫ్రీ ప్లేస్‌గా ప్రకటించారు. లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతం. 36 ద్వీపాలతో కలిసి ఉంటుంది. లక్షద్వీప్ 32 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది. మొత్తం జనాభా 64వేలు మాత్రమే. అందులో 96శాతం మంది ముస్లింలే. మిగతా వారంతా హిందువులు, బౌద్ధులు, ఇతర మతాలకు చెందిన వారున్నారు. ఇక్కడ 36 ద్వీపాల్లో కేవలం పది మంది మాత్రమే ఇండ్లను నిర్మించుకున్నారు. లక్షద్వీప్‌లో అనేక బీచ్‌లున్నాయి. అందులో కరవత్తి, కిలాతన్‌, మినికాయ్‌, చెట్లత్‌, కద్మత్‌, అగతి, అమిని, బిత్రా, ఆందేహ్, కల్పాని బీచ్‌లున్నాయి. ఇక ఈ ప్రాంతం పాము రహిత రాష్ట్ర హోదాను కూడా పొందింది.

అంతే కాదు దీన్ని రేబిస్‌ రహిత రాష్ట్రంగానూ పిలుస్తుంటారు. ఇక్కడ ఏ ప్రాంతంలోనూ కుక్కలు కనిపించవు. లక్షద్వీప్‌కు వచ్చే పర్యాటకులు సైతం ఇక్కడకు కుక్కలను తీసుకురారు. ఇక లక్షద్వీప్‌లో పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ద్వీపంలో సిరేనియా, సముద్రపు ఆవులను చూడొచ్చు. కానీ, ఇప్పుడు చాలా ప్రదేశాల్లో అవి కనిపించ‌డం లేదు. ఇదిలా ఉండగా.. భారతదేశంలో 350 రకాల పాములున్నాయి. 2022 గణాంకాల ప్రకారం.. దేశంలో కేవలం 20శాతం పాములు మాత్రమే విషపూరితమైనవి. ఈ విషపూరిత పాముల్లో కేవ‌లం 90శాతం మరణానికి కారణమయ్యే స్టింగ్ పాములు నాలుగు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి.

Latest News