Husband’s Marriage | భార్యలిద్దరు కలిసి భర్తకు మూడో పెళ్లి చేశారు.. ఎందుకో తెలుసా..?

Husband's Marriage | సాధారణంగా భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటేనే భార్య కాళ్లకింద భూమి కదిలిపోతుంది. తన జీవితం నాశనమై పోయిందని ఆందోళన చెందుతుంది. దాంతో పచ్చని కాపురంలో చిచ్చు మొదలవుతుంది. గొడవలతో బంధం బలహీనమై పెళ్లి పెటాకులకు దారితీస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో మాత్రం ఇద్దరు మహిళలు సగటు మహిళలకు భిన్నంగా వ్యవహరించారు.

  • Publish Date - July 1, 2024 / 10:58 AM IST

Husband’s Marriage | సాధారణంగా భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటేనే భార్య కాళ్లకింద భూమి కదిలిపోతుంది. తన జీవితం నాశనమై పోయిందని ఆందోళన చెందుతుంది. దాంతో పచ్చని కాపురంలో చిచ్చు మొదలవుతుంది. గొడవలతో బంధం బలహీనమై పెళ్లి పెటాకులకు దారితీస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో మాత్రం ఇద్దరు మహిళలు సగటు మహిళలకు భిన్నంగా వ్యవహరించారు.

ఇప్పటికే ఆ మహిళలిద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అది చాలదన్నట్టు తాజాగా ఇద్దరు కలిసి తమ భర్తకు మరో మహిళతో పెళ్లి జరిపించారు. భార్యల ప్రోత్సహంతో అతగాడు ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెదబరియలు మండలంలో ఈ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే.. మండలంలోని కించూరు గ్రామానికి చెందిన సాగేని పండన్నకు 2000 సంవత్సరంలో పార్వతమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. కానీ ఆమెకు సంతానం లేదు. దాంతో 2005లో అప్పలమ్మ అనే మరో మహిళను పండన్న రెండో వివాహం చేసుకున్నాడు. 2007లో వీరికి ఒక బాబు పుట్టాడు.

ఆ తర్వాత ఆమెకు కూడా మరో సంతానం కలుగలేదు. దాంతో ఒక్క సంతానంతో సంతృప్తి చెందని పండన్న తన ఇద్దరు భార్యల అనుమతితో మూడో పెళ్లి చేసుకున్నాడు. జూన్‌ 25న జరిగిన ఈ పెళ్లికి పెళ్లికొడుకు మొదటి ఇద్దరు భార్యలే పెద్దలుగా వ్యవహరించారు. పెళ్లి పత్రికలు ముద్రించి, పెద్దపెద్ద బ్యానర్లు వేయించి, ఈ వివాహాన్ని ఘనంగా నిర్వహించారు.

దీనిపై పండన్న స్పందిస్తూ.. తమ కుటుంబ సంతానం వృద్ధి కోసం తన ఇద్దరు భార్యలు పెద్ద మనసుతో సహకరించి తనకు మూడో వివాహం చేశారని తెలిపాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పండన్న చాలా అదృష్టవంతుడని కొందరు నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు.

Latest News