అడివిలో షికారు చేస్తున్న పర్యాటకులకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఎదురుగా ఓ నక్క ఎవరినో చూస్తూ, భయపడుతున్నట్లు, గిరగిరా తిరుగుతూ, గిలగిలా తన్నుకుంటూ వాళ్ల కళ్లముందే ప్రాణాలొదిలింది.
ఇక్కడ అత్యంత స్పష్టంగా కనబడుతున్నదేమిటంటే, ఆ నక్క ఎవరినో చూడటం. తనను చంపడానికే వచ్చిందన్నట్లుగా అర్థం చేసుకున్న నక్క విపరీతంగా భయపడుతూ పారిపోవడానికి ప్రయత్నించడం, ఆ అదృశ్యశక్తి(Invisible Killer) ఏదో తన చుట్టూ తిరుగుతున్నట్లు, నక్క దాన్నే చూస్తూ తన చుట్టూ తానే తిరిగింది. ఆఖరికి మీద పడి నక్క గొంతు నొక్కి చంపినట్లుగా తోస్తోంది. మరణిస్తున్నప్పుడు అది తన్నుకున్న తీరు ఎవరో చంపుతున్నట్లుగా ఉంది గానీ, తనంతటతాను చనిపోయినట్లుగా లేదు.
ఇదంతా వాహనంలోని వ్యక్తులు వీడియో తీసారు. విపరీతంగా వైరల్ అయిన ఈ వీడియో మరణానికి ముందు ఏం కనబడుతుందనేదానికి ఓ ప్రశ్నలా, ఓ సమాధానంలా ఉంది కదా.! ఆ నక్కను చంపడానికి వచ్చింది ఎవరు? మృత్యుదేవతా(God of Death)? ఇంకేదైనా మర్మశక్తా(Mysterious Power)? ఏంటది? నడిరోడ్డు మీద నిమిషాల్లో జరిగిన ఈ సంఘటన చూసినవారిని ఆశ్చర్యచకితులను చేసింది. ఎంతోమంది ఈ వీడియోను చూసి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. నాస్తికులు అది ఓ రకం వ్యాధనీ, ఆస్తికులు మృత్యదేవతనీ వాదనలు మొదలయ్యాయి.
ఏదేమైనా, “మరణానికి ముందు..?”(what happens before death) అనే ప్రశ్నకు సమాధానం ఇంకా అస్పష్టంగానే ఉంది. శాస్త్రవేత్తలు ఈ నక్క విషయంలో బహుశా ఇచ్చే ఆన్సర్… కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయిందని. ఈ భూమ్మీద ఏ మాయ, వింత జరగాలన్నా, భౌతిక సూత్రాల ప్రకారమే జరిగితీరాలి. ఇక్కడ ఆ సూత్రమే కార్డియాక్ అరెస్ట్. జరిగిన వింత ఎవరో అదృశ్యశక్తి చంపడం. ఇదెప్పటికీ రుజువు కాదు.
మనకు తెలిసిన సైన్స్ అణువంత. తెలియని శక్తి విశ్వమంత. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిగా జరిగాయి. దేనికీ స్పష్టమైన ఆధారం లేదు. మనకు తెలిసినంత వరకే సైన్స్… తెలియనిదంతా…??
షాకింగ్ విడియో: ఈ నక్కను వెంటాడి చంపిన ‘అదృశ్యశక్తి’ ఎవరు? వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదని తెలుగులో సామెత. ఈ వీడియోలో మరణించబోతున్న ఓ నక్క విచిత్ర ప్రవర్తన (Misterious Death) మీకు రకరకాల ఆలోచనలు కలిగించకమానదు. pic.twitter.com/BW68P8Hll3
— vidhaathanews (@vidhaathanews) October 13, 2024