Site icon vidhaatha

Viral news | క్యాసినోలో ఏకంగా రూ.33 కోట్లు గెలిచాడు.. కానీ ఆ సంతోషం పట్టలేక..Video

Viral news : పట్టరాని సంతోషమే అతని పాలిట శాపమైంది. కోట్ల రూపాయల నగదు గెలుచుకున్న అతను ఆ సంతోషం పట్టలేక ప్రాణాలు విడిచాడు. సింగపూర్‌లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సింగపూర్‌లోని మారినా బే సాండ్స్ క్యాసినోలో ఓ వ్యక్తి 4 మిలియన్ డాలర్లు గెలిచుకున్నాడు. అంటే మన భారతీయ కరెన్సీలో ఆ ప్రైజ్‌మనీ విలువ రూ.33 కోట్లు. కానీ అదే అతని ప్రాణం తీసింది.

వివరాల్లోకి వెళ్తే.. సదరు వ్యక్తి ఎప్పుడూ క్యాసినోల్లో నగదు పోగొట్టుకోవడమే తప్ప గెలిచిన సందర్భం లేదు. అతని ఫ్రెండ్స్ కూడా ఎప్పుడూ మనీ పోగొట్టుకుంటూనే ఉండేవారు. అయినప్పటికీ అతను క్యాసినో ఆడటం మానలేదు. ఈ క్రమంలో తాజాగా అతను ఏకంగా రూ.33 కోట్లు గెలిచాడు. దాంతో పట్టలేనంత ఆనందానికి లోనయ్యాడు. భారీ బెట్ గెలవడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

ఎగిరి గంతులేస్తూ, హుర్రే అంటూ కేకలు పెడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఊలుకూ పలుకూలేదు. స్నేహితులు, క్యాసినో సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా అతను మరణించి ఉంటాడని తెలిపారు. నగదు పోగొట్టకున్నన్ని రోజులు వాళ్లను వీళ్లను అడిగి బెట్టింగ్‌లో పెట్టాడు. తీరా భారీగా నగదు గెలిచిన తర్వాత కనీసం ఆ నగదును కూడా చూడకముందే ప్రాణాలు కోల్పోయాడు.

మారినా బే క్యాసినో చాలా పెద్దది. నాలుగు ఫ్లోర్స్ ఉంటాయి. అందులో 2,300కి పైగా స్లాట్ మెషిన్స్, రకరకాల గేమ్స్ ఉన్నాయి. అది ప్రపంచంలోనే ఫేమస్. 250 రకాల గేమ్ టైటిల్స్ ఎంచుకోవచ్చు. ముఖ్యంగా 15 వేల చదరపు మీటర్ల హౌస్‌లలో 500 గేమింగ్‌ టేబుల్స్, 1,600 స్లాట్ మెషిన్లు ఉన్నాయి. అలాగే 30కి పైగా ప్రైవేట్ గేమింగ్ రూమ్స్ ఉంటాయి. అలాంటి క్యాసినోలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అయ్యింది.

Exit mobile version